సూర్యాపేట: ఆనాటి కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎమర్జెన్సీని ప్రకటిస్తే, నేడు మోడీ పాలనలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలవుతుందని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో విమర్శించారు. కాంగ్రెస్ ఎమర్జెన్సీ విధించినప్పుడు మొత్తం ప్రజాస్వామిక హక్కులన్నింటిని కాల రాసిందని కార్మిక సంఘాల నాయకులు అందరిని నిర్బంధించారని అన్నారు. సమ్మెలు చేయవద్దంటూ హకుo జారీ చేసిందని పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకులందరినీ జైల్లో పెట్టారని గుర్తు చేశారు. నిరసన కార్యక్రమాలను ఉక్కుపాదంతో అణచివేసే చర్యలకు పాల్పడిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసి కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పారని, నాడు జరిగిన ఎన్నికల్లో ఓడించారని పేర్కొన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న బిజెపి ఈ సందర్భంగా నిరసన కార్యక్రమానికి పిలుపుని గుర్తు చేశారు. బిజెపి రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు. రాజ్యాంగ హక్కులను కాల రాసిందని అన్నారు. ప్రజాస్వామిక హక్కులను నిరాకరిస్తుందని అన్నారు. లౌకికత్వానికి వ్యతిరేకంగా మతోన్మాద రాజకీయాలను నడిపిస్తుందని విమర్శించారు. సామాజిక న్యాయానికి భిన్నంగా అసమానతలు పెంచి పోషిస్తుంది అన్నారు. జర్నలిస్టులను జైలలో పెట్టిందని పేర్కొన్నారు. విద్యార్థి ఉద్యమ నాయకులను జైల్లో పెట్టి ఉప చట్టం కింద నిర్బంధించిందని అన్నారు. ప్రతిపక్ష నాయకుల మీద రాజ్యాంగ సంస్థలను ఉపయోగించి అక్రమ కేసులు బనాయించి జైలు పాలు చేయడం వంటి ప్రజాస్వామిక చర్యలను కొనసాగించిందని అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఈనాడు బిజెపి అప్రకటిత ఎమర్జెన్సీని ప్రకటించిందని తెలిపారు. ఆనాడు కాంగ్రెస్ ఎమర్జెన్సీని ప్రకటించినప్పుడు ఆర్ఎస్ఎస్ నాయకులు ఇందిరాగాంధీకి మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. ఆనాడు కాంగ్రెస్కు ఇందిరా గాంధీకి అనుకూలంగా ఆర్ఎస్ఎస్ ఎవ్వరించిన తీరును ఆనాడే సుబ్రమణ్య స్వామి బయట పెట్టారని పేర్కొన్నారు. హిట్లర్ వారసత్వంతో కూడిన బిజెపి ఈనాడు కూడా ప్రజా ఉద్యమాలను అణచివేస్తుందని విమర్శించారు. చర్చలకు సిద్ధంగా ఉన్నామని ప్రకటిస్తున్న మావోయిస్టులను ఆపరేషన్ చంపి వేస్తుందన్నారు. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మతోన్మాద భావాలతో మతోన్మాద రాజకీయాలను కొనసాగిస్తుందన్నారు. ఆనాడు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రజలు ఎట్లాగైతే పోరాటం చేశారో ఇప్పుడు అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగిస్తున్న బిజెపి నియంతృత్వ నయా పాసిస్తూ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.