విద్యార్థులు చదువుతోపాటు క్రీడల పట్ల శ్రద్ధ చూపాలని అడిషనల్ ఎస్పీ నాగేశ్వరావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఎస్ జి ఎం క్రికెట్ అకాడమీ కుడ కుడ రోడ్డులో నిర్వహించిన నారాయణ ప్రీమియం లీగ్ నల్గొండ జోన్, ఎన్ పి ఎల్ జోన్ లెవెల్ క్రీడలు ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు మానసిక ఎదుగుదలను పెంపొందిస్తాయని క్రీడల ద్వారా శరీర, మానసిక దృఢత్వం పెంపొందించుతుందని అన్నారు. ప్రతి విద్యార్థి క్రీడల పట్ల శ్రద్ధ చూపాలని కోరారు. నారాయణ స్కూలు ఇలాంటి క్రీడలు నిర్వహించడం చాల అభినందనీయమన్నారు.ఈ కార్యక్రమంలో డిజిఎం రమణారెడ్డి, ఏజిఎం రమేష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపల్ లు పుష్పలత, నరేష్, హరిత, సైదులు, దివ్య, కోహిత తదితరులు పాల్గొన్నారు.