కాగజ్ నగర్*
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పట్టణం లోని అంబేద్కర్ చౌరస్తా నందు యాంటీ డ్రగ్స్ పై అవగాహన సదస్సును సీఐ పల్నాటి రాజేంద్రప్రసాద్ మరియు ఎస్ఐ దీకొండ రమేష్ తమ సిబ్బందితో కలిసి అక్కడ ఉన్న షాపు యజమానులకు మరియు పండ్ల దుకాణ ధారులకు ఆటో డ్రైవర్లు, విద్యార్థులకు సదస్సు ఏర్పాటు చేసినారు. అనంతరం సీఐ పల్నాటి రాజేంద్రప్రసాద్ డ్రగ్స్ మీద మాట్లాడుతూ నేటి సమాజంలో యువతరం ఎక్కువగా డ్రగ్స్ పై మొగ్గు చూపుతున్నారు… ఇది తీసుకోవడం వలన జీవితంలో చాల కుటుంబాలు అంతా వీధిన పాలవుతున్నాయి. అతి చిన్న వయసులోనే హాస్పటల్ పాలవుతూ జీవితాలు కోల్పోతున్నారు అని తెలిపారు. ఇప్పుడు వీటిపై జిల్లా పోలీస్ యంత్రాంగం అంతా ప్రత్యేక దృష్టి సాధిస్తూ వీటిని అరికట్టే విధంగా శత విధాలుగా ప్రయత్నిస్తున్నారు..
ఇప్పటి నుంచైనా జీవితాలను చదువుపై దృష్టి పెట్టి మంచి ఉద్యోగాలు సంపాదించుకోవాలని, మీ తల్లిదండ్రులను కాపాడుకుంటూ మీ జీవితానికి సాఫీగా గడుపుకోవాలంటూ సీఐ తెలిపారు. ఈ కార్యక్రమానికి సీఐ పల్నాటి రాజేంద్రప్రసాద్ మరియు ఎస్సై డి కొండ రమేష్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు…