Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

కాంగ్రెస్ పార్టీ తీర్ధం పూచ్చుకున్న అంజన్ గౌడ్..

టీయూడబ్ల్యూజే యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, సూర్యాపేట జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారింగుల అంజన్ గౌడ్ ఇటీవల తన పదవులకు రాజీనామా చేసిన విషయం విధితమే. అంజన్ గౌడ్ శనివారం కోదాడ శాసన సభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ లోకి చేరారు. అంజన్ గౌడ్ తో పాటు పుట్టా వెంకటేష్, గుగులోతు సురేష్ నాయక్, గుండు మధు లను కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. జర్నలిస్టుల యూనియన్ నాయకుడిగా గత కొన్ని సంవత్సరాలుగా జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ వ్యాప్తంగా అంజన్ గౌడ్ విశేషమైన సేవలను అందించారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. అంజి పార్టీలో చేరడం పార్టీ బలోపేతానికి ద్రోహదపడుతుందన్నారు.కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలను ప్రభావితం చేయగలిగే వ్యక్తి అంజన్ గౌడ్ అని కొనియాడారు. గత కొన్ని ఏండ్లుగా అంజన్ గౌడ్ ను చూస్తున్నానని జర్నలిస్టు యూనియన్ నాయకుడిగా జర్నలిస్టులను ఏకతాటిపై నడిపి వారి సమస్యలను పరిష్కరించడానికి కృషి చేశారని తెలిపారు. పార్టీకి వారి అవసరం తప్పనిసరని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు. అనంతరం అంజన్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే ఎన్ పద్మావతి రెడ్డి చేస్తున్న అభివృద్ధి ఎనలేనిదని కొనియాడారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తన వంతు నిర్విరామంగా కృషి చేస్తానని అన్నారు. ఈ

కార్యక్రమంలో మైనారిటీ కార్పొరేషన్ వైస్ చైర్మన్ ఎంఏ జబ్బార్, గౌడ సంఘం రాష్ట్ర నాయకులు కేఎల్ఎన్ ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాల్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, డేగ కొండయ్య, కాటంరెడ్డి ప్రసాద్ రెడ్డి, సాధినేని అప్పారావు, పంది తిరపయ్య, సిరికొండ శ్రీనివాస్, తంగెళ్ళపల్లి లక్ష్మణ్, కాసర్ల సత్యారాజ్, మాతంగి సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

జిల్లా అధికార యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలి

Harish Hs

పెంచిన వంట గ్యాస్ ధరలను తగ్గించాలి

Harish Hs

హమాలి కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటుకై చలో కలెక్టరేట్ ధర్నాను జయప్రదం చేయండి * ములుగుమండల సిఐటియు నాయకులు ఎర్రోళ్ల మల్లేశం 

TNR NEWS

మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ షేక్ బషీర్ కు కే ఎల్ ఎన్ ఆధ్వర్యంలో ఘన సన్మానం

Harish Hs

గ్రేటర్ హైదరాబాద్ తరహాలో ఆస్తి పన్ను వన్ టైం సెటిల్ మెంట్ రాయితీ ఇవ్వాలి.  సిపిఎం వన్ టౌన్ కార్యదర్శి వల్లపు దాసు సాయికుమార్

TNR NEWS

ఎమ్మెల్యే సహకారంతో వార్డు సమస్యల పరిష్కారానికి కృషి

TNR NEWS