November 16, 2025
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

మిర్చి పంటకు కనీస మద్దతు ధర 25 వేలు ప్రకటించాలి.  సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టి పెల్లి సైదులు

 

మోతే:మిర్చి పంటకు కనీస మద్దతు ధర రూ.25 వేలు ఇవ్వాలనిసిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం మండల పరిధిలోని తుమ్మలపల్లి గ్రామంలో జరిగిన సిపిఎం పార్టీ గ్రామ శాఖసమావేశంలో ఆయన మాట్లాడుతూరాష్ట్రంలో రైతులు పండించిన మిర్చికి ధర దారుణంగా పడిపోయిందన్నారు. క్వింటాల్‌కు రూ25,000 వుండాల్సిన పరిస్థితి నుంచి రూ.12,000లకు తగ్గించి వ్యాపారులు రైతులకు గిట్టుబాటు లేకుండా చేస్తున్నారని ధ్వజమెత్తారు .ఫలితంగా మిర్చి రైతుల ఆత్మహత్యలు ప్రారంభం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఖమ్మం జిల్లాలో ఇద్దరు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తు చేశారు. మరొక రైతు గుండెపోటుతో మరణించారని అన్నారు. మిర్చి బోర్డును ఏర్పాటు చేసి మద్దతు ధర నిర్ణయించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి చేయడంతో పాటు మార్క్‌ఫెడ్‌ ద్వారా మిర్చి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు . పంటకాలంలో వ్యాపారులు మార్కెట్లల్లో ధరలు తగ్గించడం, రైతుల నుండి సరుకు వ్యాపారులకు చేరిన తర్వాత ధరలను రెట్టింపు చేయడం ప్రతి ఏటా జరుగుతున్నదని,కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలో మిరప పంట క్వింటాల్‌కు కనీస మద్ధతు ధర రూ.15,000లు ఇస్తామని ప్రకటించిన అమలుకు నోచుకోలేదన్నారు. ఒకవైపు వ్యవసాయ ఖర్చులు పెరిగాయినిమరోవైపు దిగుబడులు బాగా తగ్గాయనిఎకరాకు 30, 40 క్వింటాళ్ళు దిగుబడి రావాల్సి ఉండగా క్రిమీకీటకాల వల్ల ఎకరాకు దిగుబడి 12 క్వింటాళ్ళకు తగ్గిందని ఆందోళన వ్యక్తం చేశారు ఆందోళ వ్యక్తం చేశారు.రైతులకు ఎకరాకు పెట్టుబడి రూ.1.5లక్షల నుంచి రూ.2 లక్షల వరకు పెట్టారని,ప్రస్తుతం ఉన్న మార్కెట్‌ ధరల ప్రకారం పెట్టిన పెట్టుబడులు కూడా రాని స్ధితి ఉన్నదని అన్నారు.దీంతో రైతులు ఆందోళనలు చేస్తున్నారని,రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖ జోక్యం చేసుకొని క్వింటాల్‌కు రూ.25 వేలు ధర ఉండే విధంగా చర్యలు తీసుకోవాలిని డిమాండ్ చేశారు.వ్యవసాయ మార్కెట్లలో ప్రభుత్వ నియంత్రణ పెరగాలని కోరారు. అంతర్జాతీయ మార్కెట్‌లో మిరపకు మంచి ధర ఉన్నందున వ్యాపారులకు పోటీగా మార్క్‌ఫెడ్‌ ద్వారా రూ.25 వేలకు క్వింటాల్‌ కొనుగోలు చేసినప్పటికీ ఎలాంటి నష్టం రాదన్నారు.రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు గుంట గానిఏసు, సిపిఎం గ్రామ పార్టీ నాయకులు ఎలిగి రెడ్డి వెంకట్ రెడ్డి, భాగ్యమ్మ, పిచ్చయ్య, చారి, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.

Related posts

జాతీయస్థాయిలో అవార్డు అందుకున్న తమలపాకుల సైదులు.

Harish Hs

కేంద్ర బడ్జెట్ బడా కార్పొరేట్ల కోసమే 

Harish Hs

కొత్త మెనూ ఖచ్చితంగా పాటించాలి బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి

TNR NEWS

ప్రశ్నిస్తే అరెస్టుల ఎన్నికలు ఇచ్చిన హామీలు నెరవేర్చండి

TNR NEWS

దైవత్వాన్ని పరిచయం చేసే త్రైత సిద్ధాంత భగవద్గీత

TNR NEWS

బాపూజీ గ్రంథాలయం ఎదుట బీఈడీ అభ్యర్థుల నిరసన

TNR NEWS