వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం లో సాంఘీక సంక్షేమ బాలుర పాఠశాల / కళాశాల,గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల బాలికలు పాఠశాలల ను సందర్శించి తరగతి గది, వంటశాల, ఆహారం నాణ్యత, బియ్యం నాణ్యత ను, పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెనూ ప్రకారం సకాలంలో భోజనం అందించాలని, ఆహారం తయారు చేసే సమయంలో తాజా కూరగాయలు, నాణ్యమైన నిత్యవసర సరుకులను వినియోగించాలని, పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల పఠన సామర్థ్యం, ఆరోగ్యం పట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, జిల్లా విద్యా శాఖ అధికారి రేణుక దేవి, ఆర్ డి ఓ వాసు చంద్ర,తహసిల్దార్ వెంకటేశ్వరి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.