హైదరాబాదులో జరిగే వైశ్య రాజకీయ రణభేరి సభకు కోదాడ పట్టణం నుంచి ఆర్యవైశ్యులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు వెంపటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న అన్ని ఎన్నికల్లో అన్ని పార్టీలు తమ జనాభా ప్రాతిపదికన తమకు అవకాశాలు కల్పించాలన్నారు. ఆర్యవైశ్యులకు ఏ పార్టీలో అవకాశం కల్పించిన అందరూ కలిసికట్టుగా ఉండి గెలిపించుకోవాలని సూచించారు. సామాజిక సేవా కార్యక్రమాలు, వ్యాపారాల్లో ముందున్న ఆర్యవైశ్యులు రాజకీయంగా ఎదిగినప్పుడే తగిన గుర్తింపు వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రాజకీయ విభాగం అధ్యక్షులు కుక్కడపు బాబు, ఉపాధ్యక్షులు బండారు శ్రీను, గరినే శ్రీధర్, ఓరుగంటి ప్రభాకర్, గురునాథం, గాదంశెట్టి శ్రీను, యాద సుధాకర్, పురుషోత్తం, పైడిమర్రి నారాయణరావు, వెంకటనారాయణ, వంగవీటి శ్రీను, పత్తి నరేందర్, నూనె నాగన్న, పైడిమర్రి సతీష్, వంగవీటి లోకేష్, నాగరాజు, చీదెళ్ల హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు…………….