ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య భారతదేశానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం గొప్పదని పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు *గుండెపంగు.రమేష్* , *గంధం పాండు* ఆధ్వర్యంలో హుజూర్నగర్ రోడ్డు లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో పౌరులు అందరూ స్వేచ్ఛగా జీవించడానికి రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు బాధ్యతలను కల్పించిందన్నారు. రాజ్యాంగ స్ఫూర్తితోనే నేడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీపాలన సాగిస్తుందన్నారు.అంబేద్కర్ ఆశయాల సాధన కొరకు ప్రతి ఒక్కరు కృషి చేయాలనినేటి యువత వారిని ఆదర్శంగా తీసుకొని వారు చూపిన బాటలో నడవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గుండెపంగు రమేష్, గంధం పాండు, రాష్ట్ర నాయకులు షేక్ బషీర్,భాష బోయిన భాస్కర్,గంధం యాదగిరి,బాగ్దాద్,కాసర్ల రాజశేఖర్, ,సోమపంగు వెంకటయ్య,పిడతల శ్రీను,జంగం శ్రీను, కుడుముల సైదులు,కుడుముల రాంబాబు, ఎర్ర శ్రీను, లచ్చిమల్ల కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు……….