ప్రతీ ఒక్కరిలో మానసిక ప్రశాంతత పెంచేందుకు యోగా దోహద పడుతుందని,
మానసిక ప్రశాంతతకు దోహదమైన యోగాసనాలు, ధ్యానంతో ఒత్తిడిని తట్టుకొని రక్తపోటుని నివారించుకోవాలని మునగాల మండల ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్ అన్నారు. శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మునగాల మండలం ఆకుపాముల గ్రామంలో నిర్వహించిన యోగా డే కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు..మారిన జీవన అలవాట్లు, ఆహారంతో వస్తున్న అనేక మానసిక, శారీరక అనారోగ్యాలన్నింటి నుండి బయట పడాలంటే క్రమం తప్పకుండా యోగా చేయడమే పరిష్కారం అన్నారు.జీవనశైలిలో మార్పులు, ఆహారపు అలవాట్ల నియంత్రణ, శారీరక వ్యాయాయం,మానసిక ప్రశాంతత చేకూర్చే యోగాసనాలు,ధ్యానం చేయడం ద్వారా రక్తపోటును నియంత్రించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.యోగాతో శారీరకంగా,మానసికంగా మార్పులు రావడంతో పాటు ఏకాగ్రత పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీవో శైలజ,ఈసీ కళ్యాణ్,టిఏ శ్రీధర్, పంచాయతీ కార్యదర్శి నాగరాజు,తదితరులు పాల్గొన్నారు.