మునగాల మండల ఆర్యవైశ్య సంఘం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక వాసవి భవన్ నందు స్నేహితుల దినోత్సవం వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ జీవితంలో అన్నివిధాలుగా అండదండలుగా నిలిచేది స్నేహమేనని తెలిపారు.మనకు గురువులా బోధించి,దారి చూపి,తప్పు చేసినప్పుడు మందిలించే వ్యక్తే నిజమైన స్నేహితుడిని అన్నారు.కష్ట సమయంలో కలత చెందిన మనసుకి ప్రశాంతతను కలిగించే దివ్య ఔషధం స్నేహమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం పెద్దలు మరియు వాసవి క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.