పెంచికల్ పేట్ మండలకేంద్రంలోని అగరగూడ సమీపంలోదాదాపు ఉదయం 6గంటల ప్రాంతంలో ముందస్తు సమాచారం మేరకు,బోలోరే వాహనం నంబర్ టీ ఎస్ 21,టి 9592, గల వాహనం లో అక్రమంగా,8ఆవులు, 1ఎద్దును అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. మద్దెల గంగాధర్, సయ్యద్ అబ్బు, మరియు షేక్ రహమాత్ ముగ్గురి పై కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేశామని దర్యాప్తు చేస్తున్నామని, సంరక్షణ కై పశువులను గోశాలకు తరలించినట్లు ఎస్సై కొమరయ్యతెలిపారు.