నిరాధార నిందలు వేసినా వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలనుకునే చౌకబారు ప్రయత్నాలు మానుకుని,హుందాతనాన్ని నిలుపుకోవాలి అని కిట్స్ కళాశాల చైర్మన్ నీలా సత్యనారాయణ అన్నారు.వ్యక్తిగతంగా తనపై, కళాశాల, వ్యాపార లావాదేవీలపై కొంతమంది వ్యక్తులు పనిగట్టుకొని చేస్తున్న ఆరోపణలపై బుధవారం కిట్స్ కళాశాల లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ కళాశాల అభివృద్ధిని ఓర్వలేకనే తనపై ఆరోపణలు చేస్తున్నారని,కొంత మంది వ్యక్తులు మొదట ఈ కళాశాల ఏర్పాటు చేశారని అప్పుడు లేని నిబంధనలు నేను 15 సంవత్సరాలుగా ఈ కళాశాల తీసుకున్న తర్వాత ఏదో నేను తప్పుడు డాక్యుమెంట్లు పెట్టి కళాశాల ఏర్పాటు చేసినట్టు ఆరోపణలు సరికావన్నారు.వారికి నా వ్యక్తిగతంగా ఆర్థికంగా ఎంతో సహాయం చేశానని, అయినా మానవత్వం లేకుండా నన్ను బెదిరింపులకు గురి చేస్తూ,నా కుటుంబానికి వారు చేస్తున్న ద్రోహాన్ని చూడలేకపోతున్నానని అన్నారు.వారు నా కుటుంబాన్ని అంతం చేయాలని ఉద్దేశంతో కొన్ని రోజుల క్రితం మా కుటుంబం పై దాడి కూడా చేశారని దీనిపై పోలీసులు తక్కువ సెక్షన్ లతో కేసు నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా నా వ్యాపార లావాదేవీలలో ఎవరినైనా మోసం చేసినట్లు ఉంటే వారితో నేను చర్చలకు సిద్ధమని గురువారం,శుక్రవారం ఈ రెండు రోజులు వారితో చర్చించడానికి కోదాడ లోని నా యొక్క కనకదుర్గ రైస్ మిల్లువద్ద మా కుటుంబంతో సహా ఉంటామని, నాది తప్పు అని తేలితే ఎటువంటి శిక్షకైనా సిద్ధమని అన్నారు.

previous post
next post