వాహనదారులు ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని కోదాడ పట్టణ సీఐ శివశంకర్ శనివారం ఒక ప్రకటనలో సూచించారు. ఓవర్ టెక్ చేసేటప్పుడు లేదా వాహనాలు నడిపేటప్పుడు కొద్ది క్షణాలు కూడా ఆగలేకపోతున్నారని, ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వాహనాల వేగాన్ని అదుపులో ఉంచుకోవాలని ఆయన తెలిపారు. పండగ సమయాల్లో కుటుంబాల్లో విషాదాలు చోటు చేసుకోకుండా జాగ్రత్త వహించాలని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక వాహనదారుడు ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటించాలని కోరారు.