సూర్యాపేట:కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 13న సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద జరిగే నిరసన, ట్రంపు, మోడీదిష్టిబొమ్మ ల దహనాలను జయప్రదం చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్ కే యం ) జిల్లా కన్వీనర్ మండారి డేవిడ్ కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని చంద్ర పుల్లారెడ్డి జరిగిన సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేయం) జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ట్రంపు దూకుడుతో మన దేశంలో తయారు చేసే వస్తువులపై50 సుంకాలు విధించడం, వ్యవసాయ ఉత్పత్తులు దిగుమతి చేసుకోవాలని చేస్తున్న ఒత్తిళ్లు దేశ వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించారు. ట్రంపు ఒత్తిళ్లకు మోడీ తలొగడం గమ్ముగా ఉండటం వల్ల మన దేశ సౌర బహుమత్వానికే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా నుండి పాల ఉత్పత్తులు, గోధుమలు, సోయాలు దిగుమతి చేసుకుంటే మన రైతులు మన రైతులు ఏం కావాలని ప్రశ్నించారు. దేశంలో వ్యవసాయ అనుబంధ రంగాలలో పాల ఉత్పత్తిదారులదే కేకమని చెప్పారు. అమెరికా పాలు దిగుమతి చేసుకుంటే మన దేశంలో వ్యవసాయ రంగంతో పాటు పాల సేకరణ పై బతుకుతున్న సన్న చిన్న కారు రైతుల కుటుంబాలు ఆర్థికంగా చితికి పోతాయని వాపోయారు. రష్యా నుండి చమురును దిగుమతి చేసుకోవద్దని చెప్పడానికి ట్రంప్ ఎవరని ప్రశ్నించారు. కార్పొరేట్లకు మేలు చేసే విధంగా 44 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్ లను తేవడం దుర్మార్గమన్నారు.10 గంటల పని విధానాన్ని అధికారికంగా అమలు చేయాలని రాష్ట్రాలపై కేంద్రం ఒత్తిడి తీసుకురావడం దారణమన్నారు. మోడీ నిర్ణయాలను కర్ణాటక, తెలంగాణలో అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలు చేయకపోవడం సిగ్గుచేటు అన్నారు. ట్రంప్ ముందు మోడీ బానిసగా మారారని, దేశ ప్రజలను కూడా బానిసలుగా మార్చే కుట్ర జరుగుతుందన్నారు. మోడీ వెంటనే తన నిర్ణయాలను వెంటనే మానుకోకపోతేప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఏ ఐ కె ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరికుప్పల వెంకన్న, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టి పెళ్లి సైదులు, సిపిఐ పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు ఎం సిపిఐ యు జిల్లా కార్యదర్శి షేక్ నజీర్, ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి కు నుకుంట్ల సైదులు, పి డి ఎస్ యు జిల్లా అధ్యక్షులు పోలే బోయిన కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

previous post
next post