గొల్లప్రోలు : చివరి దశలో నిలిచిపోయిన కాంట్రాక్టు లెక్చరర్స్ సర్వీస్ రెగ్యులరైజేషన్ ప్రక్రియను పునఃప్రారంభించాలని, మే నెల సంబందించిన 2024 మరియు 2025 వేతనాలు తక్షణమే విడుదల చేయాలని తదితర సమస్యల పై చర్చించి, భవిష్యత్ కార్యాచరణ ప్రకటించడానికి కాంట్రాక్టు లెక్చరర్స్ 475 అసోసియేషన్ రాష్ట్ర విస్తృత స్థాయి అత్యవసర సమావేశం ఈ నెల 31 న విజయవాడ యూటీఎఫ్ భవన్ జరుగుతుందని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాణిక్యం గొర్ల శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సమావేశానికి ఉభయగోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి, మాజీ ఎమ్మెల్సీలు హాజరౌతారని తెలిపారు. రాష్ట్ర నలు మూలల నుండి కాంట్రాక్టు లెక్చరర్స్ అసోసియేషన్ ప్రతినిధులు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినప్పటికి తమ సర్వీస్ రెగ్యులరైజేషన్ ప్రక్రియ ప్రారంభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రెగ్యులరైజ్ చేసి న్యాయం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఉపముఖ్యంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ లకి విజ్ఞప్తి చేశారు. ప్రకటన విడుదల చేసిన వారిలో రాష్ట్ర నాయకులు కె.రత్నకుమారి, బి.జె.గాంధీ, జాన్ బాబు, శేషగిరి, ఉమాదేవి, లతా, శాం కిరణ్, కాశీ రత్నం, ఖాదర్ వల్లీ తదితరులున్నారు.