వయోవృద్ధుల దినోత్సవం ను పురస్కరించుకుని శనివారం కోదాడ పట్టణంలోని స్థానిక పెన్షనర్స్ భవన్ లో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ న్యాయవిజ్ఞాన సదస్సులో సీనియర్ సివిల్ జడ్జి కె సురేష్ మాట్లాడుతూ వయోవృద్ధులు(సీనియర్ సిటిజన్స్) తమకు ఉన్న హక్కులు,చట్టాలు తెలుసుకొని ఉపయోగించుకోవాలని కోరారు. సమాజంలో మానవతా విలువలు తగ్గి,ఆర్ధిక సంబంధాలు ప్రధానంగా మారినాయన్నారు.ఆస్తుల పంపకాలు, ఇతర ఆర్థిక పరమైన విషయాల్లో సమస్యలు వస్తున్నాయని, వయోవృద్ధులుగా ఉన్న వారిని నిర్లక్ష్యం చేస్తున్నారని అప్పుడు ట్రిబ్యునల్, కోర్టు లను ఆశ్రయించి న్యాయం పొందాలన్నారు.వయోవృద్ధుల సమస్యలు పరిష్కారం కోసం చట్టాలను ఉపయోగించుకోవాలన్నారు. RDO ఆధ్వర్యంలో ట్రిబ్యునల్ ద్వారా వయోవృద్ధుల సంక్షేమం కోసం,హక్కుల కోసం పని చేస్తుందన్నారు. 1వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి md. ఉమర్ మాట్లాడుతూ వయోవృద్ధుల కోసం ప్రభుత్వాలు అనేక రాయితీలు కల్పిస్తున్నామన్నారు.ఆదాయ పన్ను,బ్యాంక్ లలో రాయితీలు,RTC,రైల్వే,ఇతర ప్రయాణ సౌకర్యం కల్పించడం జరుగుతుంది. అలాగే కోర్టుల్లో కూడా జీవనభృతి కోసం కేసులు వేసుకోవచ్చని,అలాగే ప్రాపర్టీ గిఫ్ట్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు *ఉయ్యాల నర్సయ్య అధ్యక్షతన* జరిగిన ఈ న్యాయ విజ్ఞాన సదస్సులో *1వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి md ఉమర్*,సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ *ch. సత్యనారాయణ*,బార్ అసోసియేషన్ కార్యదర్శి రామిశెట్టి రామకృష్ణ, పెన్షనర్స్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రావెళ్ల సీతారామయ్య,నాయకులు,బొల్లు రాంబాబు, వేనేపల్లి శ్రీనివాసరావు,గడ్డం నర్సయ్య, న్యాయవాదులు గట్ల నర్సింహారావు, యడ్లపల్లి వెంకటేశ్వరరావు,మంద వెంకటేశ్వర్లు,హేమలత,జి.Short, లీగల్ సర్వీస్ కమిటీ సిబ్బంది, సీనియర్ సిటిజన్స్ తదితరులు పాల్గొన్నారు.