Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

సైబర్ నేరాల పై అవగాహన

సూర్యాపేట జిల్లా ఎస్పీ కె నరసింహ ఐపిఎస్ ఆదేశాల మేరకు కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి  ఆధ్వర్యంలో షీ టీమ్ ఎస్ ఐ మల్లేష్ సూచనలతో కోదాడ పట్టణం లోని తేజ టాలెంట్ స్కూల్లో షీ టీమ్స్ , సైబర్ నేరాలపైన, గంజాయి, డ్రగ్స్ మత్తుమందులపై విద్యార్థి మరియు విద్యార్థినులకు లకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది.

షీ టీమ్ హెడ్ కానిస్టేబుల్ కవిత మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా ఎస్పీ అధ్వర్యంలో షీ టీమ్స్, సైబర్ నేరాలపై, గంజాయి డ్రగ్స్ మత్తు మందులు, గుట్కాపై పటిష్టంగా పనిచేస్తున్నామని తెలిపారు. ప్రతి గ్రామంలో, స్కూల్లో కళాశాలలో, వసతి గృహాలలో చదువుకునే విద్యార్థులు, యువతి యువకులు ఇంటర్నెట్ ను సద్వినియోగం చేసుకోవాలి, సైబర్ మోసగాళ్ళ వలలో పడి మోసాలకు గురి కావద్దు, బ్యాంక్ ఖాతా,

ATM కార్డ్ వివరాలు, OTP వివరాలు ఇతరులకు తెలపవద్దు, ఇతరులు ఆశ చూపితే వాటికి ఆకర్షితులు కావొద్దు. మెసేజ్ లలో వచ్చే బ్లూ లింక్ అనుసరించి వ్యక్తిగత వివరాలు నమోదు చేయవద్దు అని కోరినారు. సైబర్ మోసాలపై 1930

 టోల్ ఫ్రీ నంబర్ కు పిర్యాదు చేయాలని అన్నారు. అలాగే వేధింపులపై డయల్ 100 కు సమాచారం ఇవ్వాలని తెలిపినారు.

వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు, ఏటీఎం పిన్ నెంబర్లు, సోషల్ మీడియాలో బహిర్గతం చేయొద్దన్నారు. వ్యక్తిగత ఫోటోలను DP లుగా పెట్టుకోవద్దని చెప్పారు.మొబైల్ యాప్ లలో వచ్చేటువంటి అనవసరమైన బ్లూ లింకులను క్లిక్ చెయ్యొద్దు అని తెలిపారు. యువత చెడు వ్యసనాల బారిన పడొద్దు అన్నారు.గంజాయి మత్తుమందులకు సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిస్తే తప్పకుండా పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని తెలియజేశారు.యువత లోన్ యాప్ లకు దూరంగా ఉండాలన్నారు.సామాజిక మాధ్యమాలకు రక్షణగా బలమైన పాస్వర్డ్లు పెట్టుకోవాలని అన్నారు మహిళల రక్షణ పై పటిష్టంగా పనిచేస్తున్నామని, ఆకతాయిలా ఆటలు సాగవని, మహిళలను ఆడపిల్లలను గౌరవించాలని తెలియజేశారు అదేవిధంగా ఆత్మ రక్షణ కొరకు మెలుకువలు నేర్చు కోవాలన్నారు. ఎవరైనా మీ ఆత్మగౌరవాన్ని భంగపరిచినట్లయితే షీ టీం నెంబర్ 8712686056 కు సమాచార తెలియజేయవచ్చు అన్నారు టీ సేఫ్ యాప్ గురించి విద్యార్థినిలకు వివరించారు. ఈ కార్యక్రమం నందు తేజ టాలెంట్ పాఠశాల ప్రిన్సిపల్ బి.సోమా నాయక్, షి టీమ్ మహిళా కానిస్టేబుల్ సాయి జ్యోతి, నాగేంద్రబాబు, పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్తులు పాల్గొన్నారు.

Related posts

నరసింహులగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం

TNR NEWS

ఘనంగా కార్తీక దీపోత్సవం

TNR NEWS

కీర్తిశేషులు శ్రీమతి ఏలూరి పార్వతి ఐదో వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

TNR NEWS

పెరిక హాస్టల్ అభివృద్ధికి కృషి చేయాలి

Harish Hs

ప్రకృతి వనాలలో చెరువుల వెంబడి రోడ్ల వెంబడి ప్రభుత్వ కార్యాలయాలలో విరివిగా పండ్ల మొక్కలు నాటాలి

Harish Hs

*మోడల్ స్కూల్( హెచ్ బి టి)  ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలి*

TNR NEWS