జగిత్యాల పట్టణ ప్రెస్ క్లబ్ ఆవరణంలో జగిత్యాల ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు రాష్ట్ర నాయకురాలు శనిగరపు కాంత ఆధ్వర్యంలో శుక్రవారం ఎమ్మార్పీఎస్ జగిత్యాల జిల్లా కమిటీ నేతృత్వంలో మహిళా విభాగం నూతన కమిటీ జిల్లా మహిళా ఇంచార్జ్ గా పెగడపల్లి గ్రామానికి చెందిన సీపెల్లి వనిత ను నియమిస్తున్నట్లు రాష్ట్ర నాయకురాలు కాంత నియామక పత్రం అందజేశారు.జిల్లా కో ఇంచార్జ్ గ మహాకంకాళి లక్ష్మి, జిల్లా అధికార ప్రతినిధిగా సీపెల్లి జమున, ఎన్నికయ్యారు.ఈ కార్యక్రమంలో ఎంఎస్పి జగిత్యాల జిల్లా అధ్యక్షులు దుమాల గంగారాం, జిల్లా అధికార ప్రతినిధి బెజ్జంకి సతీష్ మాదిగ, ఉపాధ్యక్షులు బోనగిరి కిషన్,కొల్లూరి సురేందర్,రాష్ట్ర మహిళా నాయకురాలు గడ్డం కొమురక్క,రాష్ట్ర నాయకురాలు శారద, మొకెనేపల్లి రాజమ్మ, వడ్లూరి నరవ్వ, బొమ్మేన సుకున,బొమ్మేన వసంత, బొమ్మేన కొమురవ్వ, బొమ్మేన రేనా, దుమాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.