పదే పదే నేరాలకు పాల్పడే వ్యక్తులపై పీడీ చట్టంలో భాగంగా కేసులు నమోదు చేస్తామని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. ఆయన శుక్రవారం కోదాడ పట్టణంలోని పబ్లిక్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.పలు నేరాల్లో నిందితులకు అవగాహన కల్పించారు. అన్ని మతాల పండుగలను అన్ని మతాల వారు గౌరవించాలని అన్నారు. నేరాలకు పాల్పడుతున్న వ్యక్తులకు మొదటగా కౌన్సెలింగ్ ఇస్తామని, కాని వారిలో మార్పు రాకపోతే చట్టపరంగా తీవ్రమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. చట్టాలపై ప్రతి పౌరుడు కనీస అవగాహన కలిగి ఉండాలని అన్నారు.
సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు భద్రత కల్పించి, వారిలో పోలీస్ శాఖపై నమ్మకం కలిగించాలని ఈ సందర్భంగా ఎస్పీ పోలీస్ సిబ్బందికి ఉద్బోదించారు. గంజాయి అసాఘిక కార్యకలాపాలు పూర్తిగానిర్మించాలన్నారు .పట్టణంలో పలు కేసుల్లో నేరస్తులుగా ఉన్న వారికి నేరాలపై అవగాహన కల్పించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తన కలిగి ఉండాలని సూచించారు. పోలీసులు అధికారులు తప్పుడు మార్గం నేర్చుకుంటే వారిపై కూడా కఠినచర్యలుఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి శ్రీధర్ రెడ్డి, కోదాడ టౌన్ సీఐ శివశంకర్, రూరల్ సీఐ ప్రతాప్ లింగం, మునగాల సీఐ రామకృష్ణారెడ్డి, హుజూర్నగర్ సిఐ చరమందరాజు, సబ్ డివిజన్ ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.