ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా సంక్షేమ పథకాలను అంకురార్పణ చేసిన మహనీయుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి అని కోదాడ మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకటరత్నం బాబు అన్నారు. మంగళవారం కోదాడ పట్టణంలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని నిర్వహించి ఆయన మాట్లాడారు. నాడు ముఖ్యమంత్రిగా వైయస్ రాజశేఖర్ రెడ్డి కిలో రెండు రూపాయలకు బియ్యం పథకం, వృద్ధాప్య, వితంతు, వికలాంగ పింఛన్లు రైతులకు ఉచిత విద్యుత్తు ఆరోగ్యశ్రీ, కుయ్ కుయ్ అని 108, పేద విద్యార్థులకు ఉన్నత చదువులు చదవడానికి ఫీజు రియంబర్స్మెంట్ రైతులకు సాగునీరు కోసం ప్రాజెక్టులు వంటి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో నిలిచిపోయారన్నారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ముఖ్య మంత్రి గా రైతుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసిన రైతు పక్ష పాతి వైఎస్ ఆర్ అన్నారు. చెరగని చిరునవ్వు తో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకున్న మహా నేత వైఎస్ ఆర్ అన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను ప్రతి ఒక్కరూ సాధించాలన్నారు. అనంతరం జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు వంగవీటి రామారావు, టిపిసిసి డెలిగేట్ సిహెచ్ లక్ష్మీనారాయణ రెడ్డి తో కలిసి రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు, మాజీ కౌన్సిలర్లు పెండ వెంకటేశ్వర్లు, గుండెల సూర్యనారాయణ, కాజా గౌడ్, కట్టేబోయిన శ్రీనివాస్ యాదవ్, తిపిరిశెట్టి రాజు, కాంగ్రెస్ నాయకులు రావెళ్ళ కృష్ణారావు, బాల్ రెడ్డి, కాంపాటి పుల్లయ్య, బాజన్, బాగ్దాద్, గంధం పాండు, శోభన్ తదితరులు పాల్గొన్నారు.

previous post