గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి గ్రామ స్వరాజ్యం సాధించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొప్పుల జైపాల్ రెడ్డి అన్నారు. గురువారం మునగాల మండల పరిధిలోని ఈదుల వాగు తండా గ్రామంలో ఎంజిఎన్ఆర్ఈజిఎస్ నిధుల నుండి రెండు లక్షల రూపాయల వ్యయంతో సిసి రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మునగాల మండల వ్యాప్తంగా పలు గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సహకరిస్తున్న మంత్రి ఉత్తమ్,ఎమ్మెల్యే పద్మావతి లకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఈదుల వాగు తండ గ్రామ శాఖ అధ్యక్షుడు నాగరాజు మునగాల మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జిల్లేపల్లి వెంకటేశ్వర్లు వెంకటరమపురం గ్రామ శాఖ అధ్యక్షుడు కీత రమేష్, నేలమరి గ్రామ శాఖ అధ్యక్షుడు సతీష్ రెడ్డి ఉపేందర్ హుస్సేన్ భాస్కర్ సుందర్ ముని జాన్ నాగమ్మ గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.