ఆదివారం నాడు హైదరాబాదు నుండి విజయవాడ వెళుతున్న ఇన్నోవా వాహనం మునగాల మండలం ముకుందాపురం బస్టాండ్ వద్ద ఎ క్లాస్ కన్ పేట తండవాసి, నడిగూడెం మాజీ సింగిల్ విండో డైరెక్టర్ సేవ్యా, ద్విచక్ర వాహనం మీద వెళ్తూ కూరగాయలు అమ్ముకునేందుకు వెళ్తున్న సందర్భంలో ఇన్నోవా వాహనం ఢీకొని బానోతు సేవ్యా అక్కడికక్కడే దుర్మరణం చెందడం చాలా బాధాకరమని ఇప్పటివరకు ఆ ప్రాంతంలో 40 ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా స్పందించి అక్కడ అండర్ పాస్ నిర్మించాలని కోదాడ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పందిరి నాగిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. చనిపోయిన సేవ్యా పార్దివ దేహానికి నివాళులర్పించారు. వారి కుటుంబానికి అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో వారి వెంట ఎమ్మెస్ విద్యాసంస్థల సీఈవో ఎస్ఎస్ రావు, పలువురు బంధువులు, గ్రామస్తులు ఉన్నారు.