తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ ను నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాలని పలువురు రజక సంఘం నాయకులు పేర్కొన్నారు. బుధవారం ఐలమ్మ 40వ వర్ధంతి సందర్భంగా పట్టణ రజక సంఘం ఆధ్వర్యంలో మున్సిపాలిటీ ఎదురుగా ఉన్న ఆమె విగ్రహమునకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు రజక సంఘం నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో వీరనారి చాకలి ఐలమ్మ పాత్ర మరువలేనిదని భూమికోసం, భుక్తి కోసం పేద,బడుగు బలహీన వర్గాల కోసం దొరలపై, పెతందార్లపై ఆమె రాజీలేని పోరాటం చేశారని ఆమె సేవలను కొనియాడారు. నేటి తరం ఐలమ్మను ఆదర్శంగా తీసుకొని ఆమె ఆశయల సాధన కోసం కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో రజక సంఘం గౌరవ అధ్యక్షులు. సట్టు నాగేశ్వరరావు, పిల్లుట్ల కృష్ణయ్య,సట్టు ఎల్లయ్య, నాగేంద్ర, లింగయ్య, సింహాచలం, రాంబాబు, సతీష్, సురేష్,గోపాలకృష్ణ, వెంకన్న, వీరయ్య, కోటి తదితరులు పాల్గొన్నారు……….