Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

మల్లన్న కళ్యాణాన్ని ఇంకా బ్రహ్మాండంగా జరిపించాలి* చట్టప్రకారం నడుచుకుంటే అందరికీ మంచిది* దేవుడి విషయంలో రాజకీయం చేయదల్చుకోలేదు మల్లన్న కళ్యాణాన్ని ఇంకా బ్రహ్మాండంగా జరిపించాలి నియోజవర్గ ప్రజలు చల్లంగా ఉండాలని కోరుకుంటున్నా జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

చట్ట ప్రకారం ప్రొటోకాల్ పాటిస్తే అందరికీ బాగుంటుందని,నా అభిప్రాయం..అయితే దేవుడి విషయంలో రాజకీయం చేయదల్చుకోలేదని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.ఆదివారం సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవానికి ఎమ్మెల్యే పల్లా హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొని,కళ్యాణాన్ని తిలకించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అంగరంగ వైభవంగా జరిగే కొమురవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవానికి వేలాది మంది భక్తులు వచ్చేవారని,ఈ సారి భక్తుల సంఖ్య తగ్గింది.మనందరి ఇలవేల్పు మల్లన్న కల్యాణాన్ని ఇంకా బ్రాహ్మండగా జరపాలని అధికారులను కోరుచున్నా రాజకీయాలకు తావు లేకుండా పట్టు వస్త్రాలు,ముత్యాల తలంబ్రాలు మంత్రులు,ఎమ్మెల్యేలు తీసుకుని వెళ్లాల్సింది ఉంది.కానీ,ఇవాళ ప్రోటోకాల్ లేకుండా మేం మాత్రమే తీసుకెళ్తాంఅన్నారని,దాని గురించి వివాదం చేయకుండా భక్తజనులతో సహా మేమంతా కూర్చొని స్వామివారి కళ్యాణాన్ని వీక్షించామన్నారు.దేవుడు విషయం కాబట్టి దీనిని రాజకీయం చేయదల్చు కోలేదు..అయితే చట్టప్రకారం ప్రొటోకాల్ పాటిస్తే బాగుంటుందని నా విన్నపం..

వచ్చే ఏడాది వరకు మల్లన్న కళ్యాణ విషయంలో మౌళిక వసతులు, సౌకర్యాలు పెంచి భక్తులు ఎక్కువగా వచ్చేలా చూడాలని అధికారులకు సూచించారు.అందుకే ఒక్క మాట మాట్లాడకుండా భక్త జనులతో ఉండి అధికారులు ఏం చెప్పారో అదే పాటించాం.జనగామ నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేలా చూడాలని మల్లన్న స్వామిని ఈ సందర్బంగా కోరుకుంటున్నానని అన్నారు.

Related posts

మొల్లమాంబ విగ్రహ దిమ్మెను పునః ప్రతిష్ఠించాలి అణ గారిన కుమ్మరులకు అవమానం

TNR NEWS

కబడ్డీ అసోసియేషన్ కోదాడ మండల అధ్యక్షుడిగా షేక్ బాగ్దాద్..

TNR NEWS

ప్రశ్నిస్తే అరెస్టుల ఎన్నికలు ఇచ్చిన హామీలు నెరవేర్చండి

TNR NEWS

*తెలంగాణ వ్యాప్తంగా డిసెంబర్ 7న ఆటో బంద్..*

TNR NEWS

కనుల పండువగా దేవాలయ వార్షికోత్సవం……..  జై శ్రీరామ్ నామస్మరణతో మారుమోగిన ఆలయ ప్రాంగణం……..

TNR NEWS

వావ్ ” సిద్దిపేట ట్యాంక్ బండ్… డెనోసార్ పార్క్.. సిద్దిపేట కోమటి చెరువు పర్యాటకను మెచ్చిన జర్మనీ పర్యాటక బృందం

TNR NEWS