సూర్యాపేట : మున్సిపల్ పరిధిలోని పిల్లలమర్రి ప్రభుత్వ పాఠశాలలో 1992-93 సంవత్సరంలో 10వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆదివారం పాఠశాలలో ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా నాడు విద్య బోధించిన గురువులను సన్మానించుకున్నారు. అనంతరం ఒకొక్కరుగా మాట్లాడి పాఠశాల జ్ఞాపకాలు, ప్రస్తుత జీవన విధానాన్ని చెప్పుకొని ఆనందంగా గడిపారు. కష్టాల్లో ఉన్న మిత్రులను ఆదుకోవాలని, ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి సహకరించాలని నిర్ణయించుకున్నారు. ప్రధానోపాధ్యాయులు దేవరశెట్టి జనార్థన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాటి గురువులు మరియు పూర్వ విద్యార్థులు
మాదగోని సత్యనారాయణ , కాసరపు సురేందర్ రెడ్డి,చెరుకుపల్లి వెంకట్ లాల్,నల్ల శ్రీనివాస్, సూరారపు రవి ,మేకపోతుల జానీ,తదితరులు పాల్గొన్నారు