వికారాబాద్ :
లగచార్లలో జిల్లా కలెక్టర్, అధికారులపై జరిగిన దాడి లో బిఆర్ఎస్ నాయకులు ఉద్దేశాపూర్వకంగా సహకరించారని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు.
రైతులతో మాట్లాడటానికి తీసుకెళ్లి జిల్లా స్థాయి అధికారులపై దాడికి పాల్పడ్డ బీఆర్ఎస్ నాయకులు సురేష్.
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ సూచనలతోనే దాడులు జరిగాయని ఆయన మండిపడ్డారు.
రాష్ట్రంలో రోజురోజుకు బీఆర్ఎస్ ఉనికి కోల్పోవడంతోనే ఇలాంటి దాడులకు ఆద్యం పోస్తున్నారని, ప్రజలు తగిన బుద్ధి చెప్తారు అన్నారు.
రైతులపై తమకు కూడా ప్రేమ ఉందని, వారికి ఎక్కడ అన్యాయం జరగకుండా తగిన విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.
జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరును ఓర్వలేకనే బీఆర్ స్ పార్టీ నాయకులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు.
ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వంలో చాలా సందర్భాలలో రైతుల నుండి భూసేకరణ చేసినప్పటికీ ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ జరగలేదని, ఈ సంఘటన చాలా బాధాకరమని ఎమ్మెల్యే కాల యాదయ్య తెలిపారు.
జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులపై రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా ప్రస్తుతం దాడులు జరగడం విశారకరామని దాడులకు పాల్పడిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నారు.
రైతులకు ప్రభుత్వం తగు న్యాయం చేస్తుందని అన్నారు.