November 16, 2025
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

తెలంగాణలో మరోబిసి ఉద్యమానికి ప్రజలు సిద్ధం కావాలి

తెలంగాణ రాష్ట్రంలో మరో బీసీ ఉద్యమానికి ప్రజలు సిద్ధం కావలసిన సమయం ఆసన్నమైనదని బీసీ జేఏసీ జిల్లా కన్వీనర్ భద్ర బోయిన సైదులు తెలిపారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బిసి జెఎసి కార్యాలయం నందు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీ ఐక్య కార్యాచరణ కమిటీ బిసి బంద్ ఫర్ జస్టిస్ 18 వ తారీకు తలపెట్టిన కార్యక్రమాన్ని సూర్యాపేట పట్టణంలో వివిధ పాఠశాలలు కళాశాలల యాజమాన్యాలు, వ్యాపారస్తులు కార్మిక లోకం ,సబ్బండ వర్గాల ప్రజలందరూ స్వచ్ఛందంగా అందరూ ఈ బందుకు సహకరించి మరొక్కసారి బీసీల ఐక్యత చాటాల్సిన అవసరం ఉందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆనాడు కామారెడ్డి డిక్లరేషన్ లో ప్రకటించిన బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అని ప్రగల్బాలు పలికి నేడు బీసీలకు మొండి చేయి చూపిన దాఖలాలు కనిపిస్తున్నయన్నారు. చట్టబద్ధతకు లోబడి చేయాల్సిన చట్టాలని వారికి నచ్చిన రీతిలో జి ఓ నెంబర్ 9 ని తీసుక వచ్చినది వారి యొక్క రాజకీయ స్వలాభం కోసమే తప్ప వెనకబడినటువంటి బీసీ వర్గాల ప్రజల కోసం కాదు అనేది ఈ సందర్భంగా తేట తెల్ల మైందని తెలిపారు. రాష్ట్రంలో ఉండబడిన బీసీ వర్గాల ప్రజలకు 42 శాతం రిజర్వేషన్ అమలుపరిచే విధంగా కేంద్ర ప్రభుత్వ మెడలు వంచాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వం పై ఉందనేసి ఈ సందర్భంగా తెలియజేశారు. ఇంతకాలం ఊసరవెల్లి రంగులు మార్చినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు చెబుతూ కాలం వెళ్ళదీసి,దింపుడు కాలం రోజు వరకు బీసీలను మభ్యపెడుతూ రోడ్డున పడేసిందనీ అన్నారు .బిసి లను మోసం చేసిన ఈ ప్రభుత్వానికి కాలం చెల్లిందనేసి చెప్పవచ్చు అని,రానున్న రోజులలో రాష్ట్రంలో మరో బీసీ ఉద్యమానికి ప్రజలు సిద్ధం కావాలని అన్నారు. ఏదైతే రాష్ట్రం కోసం బరితెగించి బడిసెలు పట్టుకొని కొట్లాడినామో,సబ్బండ వర్గాల యొక్క ఐక్యతను కూడగొట్టి బీసీల రిజర్వేషన్లపై మళ్లీ పోరుబాట పట్టడానికి ఈ బీసీ బిడ్డలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల కోసం బంద్ కు ప్రకటించడం జరిగినదనీ, ఆ బంద్ కు బీసీ జేఏసీ సూర్యాపేట పక్షాన పూర్తి మద్దతు ప్రకటిస్తూ ప్రతి ఒక్కరూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు . ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ జిల్లా నాయకులు బైరోజు మదనాచారి, ముత్యం ,నాగేంద్రబాబు సాయి, శివ, మనోజ్, దీక్షత్, దిలీప్ నాయక్ ,ఉమేష్, చంద్రమోహన్ ,సన్నీ మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

మట్టి వినాయకుణ్ణి పూజించండి… పర్యావరణాన్ని కాపాడండి – పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా

Dr Suneelkumar Yandra

ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ

Harish Hs

పురపాలక సంఘం కార్యాలయంలో సమావేశం. పురపాలక సంఘం స్పెషల్ ఆఫీసర్ గా అదనప కలెక్టర్ సుధీర్.

TNR NEWS

ఎమ్మార్పీఎస్ మహిళ జగిత్యాల జిల్లా ఇన్చార్జిగా వనిత 

TNR NEWS

వికలాంగుల పించను పెంచాలి

Harish Hs

కీర్తిశేషులు శ్రీమతి ఏలూరి పార్వతి ఐదో వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

TNR NEWS