సూర్యాపేట: నల్లగొండ జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, పీడిత తాడిత పేద ప్రజల హక్కుల కోసం తన జీవితాంతం పోరాటం చేసిన మల్లు వెంకట నరసింహారెడ్డి (వి ఎన్) జీవితం స్ఫూర్తిదాయకం అని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో వియన్ 21 వవర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సంస్మరణ సభలో ఆయన మాట్లాడుతూ నల్లగొండ జిల్లాలో కమ్యూనిస్టు పార్టీని నిర్మించడంలో వి. ఎన్. పాత్ర మరువలేనిది అన్నారు. ఎన్ని ఆటంకాలు వచ్చిన కడదాకా కమ్యూనిస్టు పార్టీని కంటికి రెప్పలా కాపాడిన మహా నాయకుడు విఎన్ అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అనేకమంది కార్యకర్తలను తయారుచేసి వారిని నాయకత్వం లోకి తీసుకువచ్చిన గొప్ప నాయకుడు విఎన్ అన్నారు. కమ్యూనిస్టు పార్టీలో చీలికలు వచ్చినప్పుడు మొక్కవోని ధైర్యంతో పార్టీని కంటికి రెప్పలా కాపాడిన మహా నాయకుడు విఎన్ అన్నారు. నల్లగొండ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం వి ఎన్ చేసిన పోరాటం మరువలేనిది అన్నారు. నలగొండ జిల్లాలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు కట్టాలని అనేక ఉద్యమాలు పోరాటాలు చేసిన ఫలితంగా నాగార్జున సాగర్ డ్యాం నిర్మాణం జరిగిందన్నారు. బీబీనగర్ నుండి నడికుడి వరకు రైలు మార్గం నడపాలని జిల్లాలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయాలని ఏడు దశాబ్దాల పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో అనేక ఉద్యమాలు నిర్వహించిన నాయకుడు వి ఎన్ అన్నారు. ఎలాంటి ఆడంబరాలకు పోకుండా నిడా రంబర జీవితాన్ని గడిపిన గొప్ప నాయకుడు విఎన్ అన్నారు. పదవుల కోసం ఏనాడు పాపులాడకుండా కమ్యూనిస్టు పార్టీ అభివృద్ధికి విశేష కృషి చేశారని అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సిపిఎం పార్టీ బలమైన పార్టీగా తీర్చిదిద్దడంలో విఎన్ విశేష కృషి చేశారని అన్నారు. నేటికీ నల్గొండ జిల్లాలో కమ్యూనిస్టు నాయకులుగా ఉన్న వారంతా విఎన్ శిష్యులేనని అన్నారు. రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలకు రాష్ట్ర అధ్యక్షులుగా, పనిచేశారని రాష్ట్రంలో రైతాంగం, వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం వేలాది మంది ప్రజలను కదిలించి అనేక ఉద్యమాలు పోరాటాలు నిర్వహించిన గొప్ప పోరాట యోధుడు విఎన్ అన్నారు. సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యునిగా చాలాకాలం పని చేశారని ఆయన ఆశయాన్ని నేటి యువత ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు అధ్యక్షతన జరిగిన ఈ వర్ధంతి సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోట గోపి, జిల్లా కమిటీ సభ్యులు వేల్పుల వెంకన్న,ఎల్గూరి గోవింద్, బెల్లంకొండ వెంకటేశ్వర్లు, మేకన బోయిన శేఖర్ , వీరబోయిన రవి, మద్దెల జ్యోతి, కొప్పుల రజిత, సిపిఎం పార్టీ వన్ టౌన్ కార్యదర్శి వల్లపు దాసు సాయికుమార్ 2 టౌన్ కార్యదర్శి పిండిగా నాగమణి, సిపిఎం సూర్యాపేట రూరల్ మండల కార్యదర్శి మేరెడ్డి కృష్ణారెడ్డి, నాయకులు చిన్న పంగి నరసయ్య, మేకన బోయిన సైదమ్మ, ఎం రాంబాబు, బ త్తుల వెంకన్న, యాతకుల వెంకన్న, సాన బోయిన ఉపేందర్, ఉయ్యాల నగేష్, కంచు గట్ల శ్రీనివాస్, ముక్కెర్ల వెంకన్న, కామల్ల లింగయ్య, ఒట్టే ఎర్రయ్య, సత్యం,యాతాకుల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
