కోదాడ మండల పరధిలోని నల్లబండగూడెం గ్రామానికి చెందిన గోపి(13) మూడు సం.ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో పూర్తిగా మంచానికే పరిమితమై ఏమి చెయ్యలేని స్థితి. బాబు చికిత్సకు డబ్బులు లేక, కుటుంబ పోషణే కష్టంగా ఉన్న ఆ కుటుంబానికి నకిరేకల్ కి చెందిన లిటిల్ సోల్జర్స్ ఫౌండేషన్ వారు కిరాయికి ఉంటున్న ఇంటికి వెళ్లి శుక్రవారం ఉదయం రూ. 15,200 సాయం అందించి మానవత్వం చాటుకున్నారు. సహాయం పొందిన కుటుంబం లిటిల్ సోల్జర్స్ ఫౌండేషన్ కి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లిటిల్ సోల్జర్స్ ఫౌండేషన్ ప్రతినిధి కర్నాటి నరేష్, రమావత్ సక్రూ, సుధాకర్ పాల్గొన్నారు.
