*అమరావతి : సీఎం చంద్రబాబు మీడియా సమావేశం* :
*చరిత్రను తిరగరాసేందుకు ఇక్కడ సమావేశమయ్యాం*
– రాష్ట్ర విభజన సమయంలో అనేక ఇబ్బందులు పడ్డాం – సైబరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దిన ఘనత మాదే – ముందుచూపుతో ఆనాడే సైబరాబాద్‌లో 8 వరసల రోడ్లు వేశాం – శంషాబాద్ విమానాశ్రయానికి 5 వేల ఎకరాలు ఎందుకని అందరూ ప్రశ్నించారు – అభివృద్ధికి అడ్డుపడేవారు ప్రతీచోటా ఉంటారు – అమరావతి రైతులను ఒప్పించి భూమి సేకరించాం – రాజధాని, సమాజ హితం కోసం మీరంతా భూములు ఇచ్చారు – అమరావతి కోసం మొత్తం 54 వేల ఎకరాలు సేకరించాం – మహిళా రైతులు వైసీపీ ప్రభుత్వంపై గట్టిగా పోరాడారు – అమరావతి ఉద్యమానికి ఆర్థికంగా అండగా నిలబడ్డాం – అమరావతి రైతులను గత ప్రభుత్వం అడుగడుగునా అణగదొక్కింది – అన్ని దేవాలయాల నుంచి పవిత్ర జలాలు, మట్టి తెచ్చి ఇక్కడ శంకుస్థాపన చేశాం – రూ.160 కోట్లతో జీ ప్లస్ 7 భవనం నిర్మిస్తున్నాం – నాలుగు నెలల్లోనే పనులు పూర్తి చేస్తామని అధికారులు చెప్పారు – రాష్ట్రానికి మధ్యలో ఉండే ప్రాంతం అమరావతి… ఒక రాష్ట్రం, ఒక రాజధాని – ఈ విషయం రాష్ట్రంలో ప్రతి చోటా చెప్పా – విశాఖను ఆర్థిక రాజధానిగా చేస్తాం – కర్నూలులో హైకోర్టు బెంచ్, పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం – మేం వచ్చేసరికి అప్పులు తప్ప ఏమీ కనిపించలేదు – రైతులకు కౌలు పెండిగ్ నిధులు రూ. 225 కోట్లు త్వరలో ఇస్తాం – కౌలు పెండింగ్ నిధులు రూ. లక్ష కోట్లు అవుతాయని.. తమ వద్ద డబ్బులేదని ఐదేళ్లపాటు చెప్పారు – అమరావతి.. సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ సిటీ అని గతంలోనే చెప్పా – మేం వచ్చాక రాష్ట్రమంతా భూముల విలువలు పెరిగాయి – ప్రభుత్వ డబ్బు అవసరం లేకుండా అమరావతిని అభివృద్ధి చేస్తామని చెప్పా – అమరావతికి ఎంతో పవిత్రత ఉంది.. ఇది దేవతల రాజధాని – కొత్త రాజధానికి అమరావతి పేరు బాగుంటుందని రామోజీరావు చెప్పారు – జపాన్‌లాగా ఇక్కడి రోడ్ల పక్కన రంగురంగుల పూలు ఉండాలని చెప్పా – రాజధాని పరిరక్షణకు మీరు 1,631 రోజులు ఉద్యమించారు – అమరావతికి విట్, ఎస్ఆర్ఎం, అమృత్ వర్సిటీలు వస్తున్నాయి – దేశంలో టాప్-10 విద్యాసంస్థల బ్రాంచ్‌లు ఇక్కడకు రావాలి – బుల్లెట్ రైలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరా – హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, అమరావతి మీదుగా బుల్లెట్ రైలు కావాలి – అమరావతికి రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు అంగీకరించింది – అనుకున్న సమయంలోగా పనులన్నీ పూర్తి చేయాలని కోరుతున్నా – అమరావతిలో నిర్మాణ పనులు జెడ్ స్పీడ్‌గా జరగాలి – అమరావతిలో గ్రీన్ ఎనర్జీ మాత్రమే వినియోగించేలా చర్యలు – అమరావతి ప్రాంతంలో 183 కిలోమీటర్లతో ఓఆర్ఆర్ వస్తుంది – రాజధానిలో తలపెట్టిన పనులన్నీ మూడేళ్లలో పూర్తి కావాలి – ప్రజలు గెలవాలి.. రాష్ట్రం అభివృద్ధి చెందాలని పిలుపునిచ్చా – మరో రెండు వారాల్లో పోలవరం పనులు మళ్లీ ప్రారంభం అవుతాయి – వంశధార, గోదావరి, కృష్ణా, పెన్నా నదులను అనుసంధానం చేస్తాం – కేంద్రంలో మన పరపతి బాగా పెరిగింది – ఎన్నికల్లో 93 శాతం స్టెక్ రేట్ తో గెలవడం దేశంలోనే రికార్డు – కుటుంబ నియంత్రణ పాటించాలని గతంలో నేనే కోరా – రాష్ట్రంలో పదేళ్లుగా జనాభా బాగా తగ్గిపోతోంది – ఎక్కువమంది పిల్లలే మన ఆస్తి అని ఇప్పడు పిలుపునిస్తున్నా : *సీఎం చంద్రబాబు*