Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

అమరావతి : సీఎం చంద్రబాబు మీడియా సమావేశం* :

*అమరావతి : సీఎం చంద్రబాబు మీడియా సమావేశం* :

 

*చరిత్రను తిరగరాసేందుకు ఇక్కడ సమావేశమయ్యాం*

 

– రాష్ట్ర విభజన సమయంలో అనేక ఇబ్బందులు పడ్డాం – సైబరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దిన ఘనత మాదే – ముందుచూపుతో ఆనాడే సైబరాబాద్‌లో 8 వరసల రోడ్లు వేశాం – శంషాబాద్ విమానాశ్రయానికి 5 వేల ఎకరాలు ఎందుకని అందరూ ప్రశ్నించారు – అభివృద్ధికి అడ్డుపడేవారు ప్రతీచోటా ఉంటారు – అమరావతి రైతులను ఒప్పించి భూమి సేకరించాం – రాజధాని, సమాజ హితం కోసం మీరంతా భూములు ఇచ్చారు – అమరావతి కోసం మొత్తం 54 వేల ఎకరాలు సేకరించాం – మహిళా రైతులు వైసీపీ ప్రభుత్వంపై గట్టిగా పోరాడారు – అమరావతి ఉద్యమానికి ఆర్థికంగా అండగా నిలబడ్డాం – అమరావతి రైతులను గత ప్రభుత్వం అడుగడుగునా అణగదొక్కింది – అన్ని దేవాలయాల నుంచి పవిత్ర జలాలు, మట్టి తెచ్చి ఇక్కడ శంకుస్థాపన చేశాం – రూ.160 కోట్లతో జీ ప్లస్ 7 భవనం నిర్మిస్తున్నాం – నాలుగు నెలల్లోనే పనులు పూర్తి చేస్తామని అధికారులు చెప్పారు – రాష్ట్రానికి మధ్యలో ఉండే ప్రాంతం అమరావతి… ఒక రాష్ట్రం, ఒక రాజధాని – ఈ విషయం రాష్ట్రంలో ప్రతి చోటా చెప్పా – విశాఖను ఆర్థిక రాజధానిగా చేస్తాం – కర్నూలులో హైకోర్టు బెంచ్, పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం – మేం వచ్చేసరికి అప్పులు తప్ప ఏమీ కనిపించలేదు – రైతులకు కౌలు పెండిగ్ నిధులు రూ. 225 కోట్లు త్వరలో ఇస్తాం – కౌలు పెండింగ్ నిధులు రూ. లక్ష కోట్లు అవుతాయని.. తమ వద్ద డబ్బులేదని ఐదేళ్లపాటు చెప్పారు – అమరావతి.. సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ సిటీ అని గతంలోనే చెప్పా – మేం వచ్చాక రాష్ట్రమంతా భూముల విలువలు పెరిగాయి – ప్రభుత్వ డబ్బు అవసరం లేకుండా అమరావతిని అభివృద్ధి చేస్తామని చెప్పా – అమరావతికి ఎంతో పవిత్రత ఉంది.. ఇది దేవతల రాజధాని – కొత్త రాజధానికి అమరావతి పేరు బాగుంటుందని రామోజీరావు చెప్పారు – జపాన్‌లాగా ఇక్కడి రోడ్ల పక్కన రంగురంగుల పూలు ఉండాలని చెప్పా – రాజధాని పరిరక్షణకు మీరు 1,631 రోజులు ఉద్యమించారు – అమరావతికి విట్, ఎస్ఆర్ఎం, అమృత్ వర్సిటీలు వస్తున్నాయి – దేశంలో టాప్-10 విద్యాసంస్థల బ్రాంచ్‌లు ఇక్కడకు రావాలి – బుల్లెట్ రైలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరా – హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, అమరావతి మీదుగా బుల్లెట్ రైలు కావాలి – అమరావతికి రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు అంగీకరించింది – అనుకున్న సమయంలోగా పనులన్నీ పూర్తి చేయాలని కోరుతున్నా – అమరావతిలో నిర్మాణ పనులు జెడ్ స్పీడ్‌గా జరగాలి – అమరావతిలో గ్రీన్ ఎనర్జీ మాత్రమే వినియోగించేలా చర్యలు – అమరావతి ప్రాంతంలో 183 కిలోమీటర్లతో ఓఆర్ఆర్ వస్తుంది – రాజధానిలో తలపెట్టిన పనులన్నీ మూడేళ్లలో పూర్తి కావాలి – ప్రజలు గెలవాలి.. రాష్ట్రం అభివృద్ధి చెందాలని పిలుపునిచ్చా – మరో రెండు వారాల్లో పోలవరం పనులు మళ్లీ ప్రారంభం అవుతాయి – వంశధార, గోదావరి, కృష్ణా, పెన్నా నదులను అనుసంధానం చేస్తాం – కేంద్రంలో మన పరపతి బాగా పెరిగింది – ఎన్నికల్లో 93 శాతం స్టెక్ రేట్ తో గెలవడం దేశంలోనే రికార్డు – కుటుంబ నియంత్రణ పాటించాలని గతంలో నేనే కోరా – రాష్ట్రంలో పదేళ్లుగా జనాభా బాగా తగ్గిపోతోంది – ఎక్కువమంది పిల్లలే మన ఆస్తి అని ఇప్పడు పిలుపునిస్తున్నా : *సీఎం చంద్రబాబు*

Related posts

కాకినాడ రూరల్ బాధితుడికి సిఎం సహాయనిధి కల్పించాలి

రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాలలో బండారు శ్రీనివాస్ విస్తృత ప్రచారం

Dr Suneelkumar Yandra

తిరుమల శ్రీవారి సమాచారం…

TNR NEWS

పిఠాపురంలో భారీ బైక్ ర్యాలీ

Dr Suneelkumar Yandra

దుకాణాల వద్ద మద్యపాన నిషేధంఅమలు చేయాలి..

Dr Suneelkumar Yandra

రంజాన్ ఉపవాసం భారతీయ సోదరుల సంప్రదాయం – పౌర సంక్షేమ సంఘం