Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

తిరుమలలో ట్రాఫిక్ నియంత్రణ: ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్:*

తిరుపతి జిల్లా… *తిరుమల*

 

*తిరుమలలో ట్రాఫిక్ నియంత్రణ: ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్:*

 

*యాత్రికులు మరియు వాహనాలు సాఫీగా మరియు సురక్షితంగా వెళ్లేందుకు, తిరుమలలో అధునాతన ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థ అమలు:*

 

* *భక్తులకు ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం కాకుండా నియంత్రించడమే లక్ష్యంగా 12 ద్విచక్ర వాహనాలను ఆధునికీకరించి పునః ప్రారంభం.*

 

* *12 ద్విచక్ర వాహనాలకు అదనంగా GPS సిస్టం, సైరన్, పబ్లిక్ అడ్రెస్సింగ్ సిస్టం, ఫ్లాష్ లైట్ వంటి ఆధునిక పరికరాలను అమర్చి ఆధునికీకరణ.*

 

* *తిరుమలను 5 జోన్లుగా విభజించి, ప్రతి జోన్లో ట్రాఫిక్ మొబైల్ లను నియమించి ట్రాఫిక్ నియంత్రణ.*

 

* *నిత్యం వేలాది వాహనాలు తిరుమలకు రాకపోకలు సాగిస్తున్నాయి.*

 

* *తిరుమలలో ట్రాఫిక్ జామ్ కాకుండా ప్రశాంత వాతావరణం కల్పించడమే లక్ష్యంగా ట్రాఫిక్ కార్యాచరణ.*

 

* *పోలీసు టిటిడి విజిలెన్స్ విభాగాల సమిష్టి కృషితో భక్తులలో మరింత భక్తి భావం పెంపొందింప చేసే దిశగా ముందడుగు.*

 

* *స్వల్పకాలిక ప్రణాళికలో భాగంగా ఈరోజు ఈ వాహనాలను ప్రారంభించాం..*

 

* *దీర్ఘకాలిక ప్రణాళిక కోసం భవిష్యత్తులో కమిటీ ఏర్పాటు.. వారి నివేదిక మేరకు తిరుమలలో ట్రాఫిక్ నియంత్రణ కొరకు సమీకృత వ్యవస్థను తీసుకువస్తాం.*

 

*టీటీడీ అదనపు ఈఓ శ్రీ వెంకయ్య చౌదరి ఐఆర్ఎస్.,*

 

*జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు ఐపిఎస్.,*

 

తిరుమలలో ట్రాఫిక్ నియంత్రణ ధ్యేయంగా చేసుకుని, క్రమబద్ధీకరించాలనే ముఖ్య ఉద్దేశంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ఆధునికీకరించబడిన 12 ద్విచక్ర వాహనాలను ఈరోజు తిరుమల CRO కార్యాలయం వద్ద టీటీడీ అదనపు ఈవో శ్రీ వెంకయ్య చౌదరి ఐఆర్ఎస్., గారు, జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు ఐపిఎస్., వారు జెండా ఊపి, ప్రారంభించారు.

 

ఈ సందర్భంగా టిటిడి అదనపు ఈవో శ్రీ వెంకయ్య చౌదరి ఐఆర్ఎస్., గారు మాట్లాడుతూ తిరుమలలో భక్తులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం కాకూడదనే ముఖ్య ఉద్దేశంతో తక్షణ చర్యలలో భాగంగా ఈరోజు అధునాతన సాంకేతిక పరికరాలు అమర్చిన 12 ట్రాఫిక్ ద్విచక్ర వాహనాలను ప్రారంభించాము. నిర్దేశిత పార్కింగ్ ప్రదేశాలలో భక్తుల వాహనాలను పార్క్ చేయిస్తే ట్రాఫిక్ సమస్య ఏర్పడదని, ఈ ప్రణాళికను జిల్లా ఎస్పి గారి ఆధ్వర్యంలో తిరుమల ట్రాఫిక్ పోలీసు వారు అమలు చేస్తారన్నారు.

 

తిరుమల ట్రాఫిక్ సమస్యపై అధ్యయనం చేయుటకు పోలీసు, టిటిడి విజిలెన్స్ అధికారులు నిపుణులతో కూడిన కమిటీని ఇదివరకే ఏర్పాటు చేయడం జరిగింది వారు ప్రతిపాదించిన స్వల్పకాలిక ప్రణాళికలో భాగంగా ఈరోజు ఈ వాహనాలను ప్రారంభించామని, త్వరలో దీర్ఘకాలిక ప్రణాళికను నివేదిస్తారని, నివేదిక మేరకు పోలీసు, టీటీడీ విజిలెన్స్ మరియు ఇతర శాఖల భాగస్వామ్యంతో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ సమీకృత వ్యవస్థను తిరుమలలో ఏర్పాటు చేస్తామన్నారు.

 

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ తిరుమల నిత్య కళ్యాణం పచ్చ తోరణం.. ప్రతిరోజు వేలాది వాహనాలు తిరుమలకు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ క్రమంలో ట్రాఫిక్ నియంత్రణ మరియు క్రమబద్ధీకరణ చేయుటకు తిరుమల ట్రాఫిక్ పోలీసులు అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్నారన్నారు.

 

ట్రాఫిక్ పోలీసులను ప్రోత్సహిస్తూ ప్రస్తుతం విధుల్లో ఉన్న 12 ద్విచక్ర వాహనాలకు GPS సిస్టం, ఫ్లాష్ లైట్, పబ్లిక్ అడ్రెస్సింగ్ సిస్టం, సైరన్ వంటి ఆధునిక సాంకేతికత పరికరాలను అమర్చి ఆధునికీకరించడం జరిగిందన్నారు.

 

తిరుమలను 5 జోన్లుగా విభజించి, ప్రతి జోన్లో ఒక ట్రాఫిక్ మొబైల్ నిరంతరం ఉండే విధంగా నియమించి వారి జోన్ లో ఎలాంటి ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీస్ కంట్రోల్ రూమ్ సూచనల మేరకు పనిచేస్తారన్నారు.

 

ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించిన వాహనాల ఫోటోలు తీసి, పోలీస్ కంట్రోల్ రూమ్ ద్వారా జరిమానాలు విధించేటట్లు పనిచేస్తారు. పోలీస్ కంట్రోల్ రూమ్ పర్యవేక్షణలో వీరు విధులు నిర్వహిస్తారన్నారు.

 

తిరుమలలో ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి తప్పించుకొని వెళ్లినా కూడా వారికి అలిపిరి చెక్ పాయింట్ వద్ద జరిమానా విధించే విధంగా రాబోయే రోజులలో పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు.

 

తిరుమలకు వచ్చే భక్తులు కూడా నిర్దేశిత పార్కింగ్ ప్రాంతాలలోనే వాహనాలను పార్క్ చేయాలని, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేయుటకు ట్రాఫిక్ పోలీసు వారికి సహకరించాలని, మెరుగైన ప్రజా భద్రత సమర్థవంతమైన ప్రతిస్పందనకు ట్రాఫిక్ నియంత్రణ ప్రమాదాలు నివారించాలనే ఉద్దేశంతోనే ఈ ఏర్పాటు చేశామని, భక్తులు కూడా పోలీసు వారికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

 

దేశ విదేశాల నుండి వచ్చే భక్తులు ప్రశాంత వాతావరణంలో శ్రీవారిని దర్శనం చేసుకుని వెళ్లేలా పోలీసు, టిటిడి విజిలెన్స్ విభాగాలు సమిష్టిగా పనిచేస్తాయని జిల్లా ఎస్పీ గారు తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో తిరుమల అదనపు ఎస్పీ శ్రీ రామకృష్ణ, తిరుమల డిఎస్పి విజయ శేఖర్, సిఐలు హరిప్రసాద్ తిరుమల ట్రాఫిక్, విజయ్ కుమార్ తిరుమల వన్ టౌన్, శ్రీరాముడు తిరుమల టు టౌన్, ఎస్సైలు మరియు ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

కు.ని పాటించిన రాష్ట్రాల్లో సీట్ల పెంపుకు ప్రాధాన్యత కల్పించాలి

Dr Suneelkumar Yandra

లక్ష తెల్లజిల్లేడు పువ్వులతో ఉచ్ఛిష్ట గణపతికి చతుర్థి నీరాజనం

Dr Suneelkumar Yandra

మర్రెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్‌కి హాజరైన పిజెఏ సభ్యులు

Dr Suneelkumar Yandra

డేంజర్ బెల్స్ మ్రోగిస్తున్న కాకినాడ టుటౌన్ బ్రిడ్జి

Dr Suneelkumar Yandra

చిల్లపల్లి ఆధ్వర్యంలో పిఠాపురం.. జయకేతనం సభాప్రాంగణం వద్ద స్వచ్ఛభారత్

Dr Suneelkumar Yandra

లలిత కళ పరిషత్‌ ఆధ్వర్యంలో ఘనంగా కవిశేఖర డాక్టర్‌ ఉమర్‌ ఆలీషా 140వజయంతి ఉత్సవాలు