సామాజిక సాధికారత కోసం ప్రజా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేలో భాగంగా హుజూర్ నగర్ మున్సిపాలిటీలో 25వ వార్డు నందు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ రజాక్ బాబా ఇంటి వివరాల సేకరణతో ఇన్విజిలేటర్ అన్నపూర్ణ మంగళవారం ఇంటింటి సర్వేలో కుటుంబాల వివరాలను నమోదు చేశారు ఈ సర్వేలో హుజూర్ నగర్ ఆర్డీవో శ్రీనివాసులు, స్థానిక ఎమ్మార్వో నాగార్జున రెడ్డి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు