Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

కడుపు మండిన రైతు,, ధాన్యంలోడుతో రోడ్డుకి అడ్డంగా పెట్టి ధర్నా

హుజూర్ నగర్ లో వడ్లు కొనుగోలు చేయట్లేదు అంటూ కడుపు మండిన రైతు రోడ్డుకి అడ్డంగా వడ్ల లోడు తో ఉన్న ట్రాక్టర్ ను అడ్డం పెట్టి నిరసన వ్యక్తం..

వడ్లు కొనే పరిస్థితి లేదంటూ,, వడ్లు మేము కోనం మాకొద్దు అంటున్న మిల్లర్లు…

హుజూర్నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు చేసే దిక్కు లేక ఆందోళన బాట పడుతున్న రైతులు,,,

500 బోనస్ అంటూ బోనస్ మాటలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం,, ఇప్పుడు కనీసం వడ్లు కూడా కొనే దిక్కు లేదంటే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..

గతంలో అయితే ధాన్యం కొనుగోలు సెంటర్లో పెట్టి ధాన్యాన్ని కొనుగోలు చేశారని, కనీసం ఇప్పుడు మద్దతు ధర దేవుడు ఎరుగు కానీ ఉన్న వడ్లను కొనుగోలు చేస్తే చాలంటూ రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు..

గతంలో సీఎం కేసీఆర్ ఉండగా 2700 వందల రూపాయలు ధాన్యం కొనుగోలు చేస్తే ఇప్పుడు కనీసం 2000 కూడా పలకడం లేదని అన్నారు..

మిల్లర్లంతా సిండికేట్ అయి ధాన్యం కొనుగోలు చేసే విషయంలో కొర్రలు పెడుతున్నారని, ఈ విషయం తెలిసినా కానీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, అందుకే కడుపు మండి రోడ్డుపై దాన్యంలోడుతో ధర్నా చేస్తున్నట్టు తెలిపారు.. రెండు రోజుల నుంచి తిరుగుతున్న కనీసం ధాన్యం ని ఎవరు కొనుగోలు చేసే పరిస్థితి లేదని.. వర్షం వస్తే పరిస్థితి ఏమిటో అర్థం కాలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి రైతులు వద్దనుండి ధాన్యం కొనుగోలు చేయాలని లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

Related posts

రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అట్టర్ ప్లాప్ షో – దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి.

TNR NEWS

పలు కుటుంబాలను పరామర్శించిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి

TNR NEWS

ఏసీబీ వలలో కోదాడ ఫారెస్ట్ బీట్ అధికారి

Harish Hs

పాత పద్ధతిలోనే పంచాయతీ రిజర్వేషన్లు.. 50% మించకుండా అమలు..!_

TNR NEWS

కార్పొరేట్ కు దీటుగా కోదాడ ప్రభుత్వ వైద్యశాలను తీర్చిదిద్దుతా

Harish Hs

తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత..!!

TNR NEWS