April 5, 2025
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణప్రత్యేక కథనం

రైల్వే ట్రాక్ పునరుద్దరణ పనుల పరిశీలన….. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష* **రాఘవపూర్ -కన్నాల వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు*  *ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని ప్రత్యక్షంగా పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్

 

పెద్దపల్లి జిల్లాలోని రాఘవపూర్ కన్నాల వద్ద జరుగుతున్న రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులను *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష* పరిశీలించారు.బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పెద్దపల్లి మండలం రాఘవపూర్ కన్నాల రైల్వే ట్రాక్ వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు ఘటనాస్థలానికి చేరుకొని అక్కడ జరుగుతున్న పునరుద్దరణ పనులను పరిశీలించారు.మంగళవారం రాత్రి 8.30 గంటలకు రాఘవపూర్ కన్నాల రైల్వే ట్రాక్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పి ప్రమాదం జరిగిందని, ఈ సమాచారం అందుకున్న కలెక్టర్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని బుధవారం తెల్లారుజామున వరకు ఉండి పోలీసు సిబ్బంది తో కలసి అవసరమైన చర్యలు చేపట్టారు. సింగరేణి సంస్థతో మాట్లాడి ఘటన స్థలానికి వెంటనే భారీ క్రేన్లు తీసుకుని వచ్చి పట్టాలు తప్పిన గూడ్స్ రైలును క్లియర్ చేసే పనులు ప్రారంభించారు.బుధవారం ఉదయం మళ్లీ ఘటన స్థలానికి వెళ్ళిన కలెక్టర్ అక్కడ జరుగుతున్న రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులను ట్రాక్ పై ట్రాలి పై వెళ్లి పరిశీలించి,త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రైల్వే జీఎంను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో పాలకుర్తి తహసిల్దార్ జ్యోతి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

నిరుద్యోగ యువతకు అండగా నిలుస్తున్న జిల్లా గ్రంధాలయం.. జిల్లా గ్రంధాలయ సంస్ధ చైర్మన్ వంగవీటి రామారావు…  

TNR NEWS

మంత్రి ఉత్తమ్ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి సహకారంతో మార్కెట్ అభివృద్ధికి కృషి

TNR NEWS

ప్రభుత్వ ప్రముఖులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

TNR NEWS

ఎన్నాళ్లో వేచిన ఉద్యోగం నెల రోజులు అయినా నిలవని ఆనందం

TNR NEWS

*మాలల సింహ గర్జన.. ఐక్యత కోసం.. హక్కుల కోసం: ఎమ్మెల్యే వివేక్..!!*

TNR NEWS

గుడి కందుల ఉన్నత పాఠశాలలో సీసీ కెమెరాల ఏర్పాటు.

TNR NEWS