కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం కేద్రం లోని సహకార సంఘం కార్యాలయ ఆవరణలో అఖిల భారతీయ సహకార వారోత్సవాలను గురువారం ఘనంగా నిర్వహించారు. సొసైటీ ఛైర్మన్ నాల్చార్ బాలాజీ సొసైటీ జెండాను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సొసైటీల ద్వారా రైతులకు అందిస్తున్న సేవలను వివరించారు. రైతుల కోసం నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డైరక్టర్లు దర్పల్ సంజు, పోతుల అశోక్, సాయిని శంకర్, మాత్మల్ శంకర్ అనిశెట్టి శివరాజ్, చంద్రకాంత్ పటేల్ మరియు సీఈఓ శ్రావణ్ కుమార్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.