చేర్యాల మండలంలోని అర్జున్ పట్ల జిల్లా పరిషత్ పాఠశాల ప్రదానోపాధ్యాయుడు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఉపాద్యాయుడు రామచంద్రమూర్తి ప్రత్యేక శిక్షణ నిర్వహణలో పాఠశాల విద్యార్థులు వినూత్నంగా వైవిధ్యంగా ప్రభుత్వ పాఠశాల గొప్పతనాన్ని చదువు విశిష్టతను తెలుపుతూ మన ఊరి బడి మనకెందుకు వేరే ఒడి అంటూ సుమారు రెండు గంటల పాటు స్కిట్స్,డ్యాన్సులు,వేషధారణలు ఏకపాత్ర అభినయాలు ఏ విషయాన్ని వదలకుండా అన్ని కోణాలతో విద్యార్థులు చేసిన ప్రదర్శన ఆద్యంతం ఆసక్తికరంగా గ్రామస్తులను ఆచర్య చకితులను చేసింది.తల్లి దండ్రుల సమావేశం ను విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డుల పంపిణీ ఇదే రచ్చబండ వేదికపై పాఠశాల ప్రదానోపాధ్యాయుడు మరియు గ్రామ మాజీ సర్పంచ్ మధు సూదన్ రెడ్డి సెక్రటరీ రంజిత్ యువకులు తదితరులు పాల్గొని విద్యార్థుల ప్రతిభా ప్రదర్శన ను కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఉపాద్యాయులు సుదర్శన్ రెడ్డి,కులకర్ణి,గంగా ప్రసాద్,సరిత,రజిత,బాబు గ్రామస్తులు విద్యార్థుల తల్లితండ్రులు పాల్గొన్నారు.