డిసెంబర్ 1న హైదరాబాదులోని పెరేడ్ గ్రౌండ్ లో జరిగే మాలల సింహగర్జనకు భారీ ఎత్తున మాలలు తరలివచ్చి జయప్రదం చేయాలని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర కో ఛైర్మన్, జిల్లా ఇంఛార్జీ మేక వెంకన్న, పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద శనివారం సింహ గర్జనకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు బిజెపి మనవాద తీర్పు అని 30 సంవత్సరాలుగా మాలలపై జరుగుతున్న దాడిగా అభివర్ణించారు. మాలల ఆత్మగౌరాన్ని చాటడానికి ఎస్సీ వర్గీకరణ కు వ్యతిరేకంగా స్వచ్ఛందంగా ప్రతి మాల ఇంటికొకరు, గ్రామానికి ఒక వాహనం చొప్పున, మేధావులు, ఉద్యోగులు, తరలివచ్చి, విజయవంతం చేయాలని కోరారు. మాల సంఘాలన్నీ సంఘటితమై నిర్వహించే ఈ సభ లో తమ సత్తా చాటాలని పేర్కొన్నారు. దళితుల్ని విచ్ఛిన్నం చేసే కుట్రను పాలకులు మానుకోవాలని హితవు పలికారు. ఈ మాలల సింహ గర్జనకు మాల ప్రముఖులు గడ్డం వివేక్, నాగరాజు,మేడి సత్యం, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర చైర్మన్ జి, చెన్నయ్య, రాష్ట్ర కన్వీనర్ డి సర్వయ్య తదితరులు హాజరవుతున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర కో చైర్మన్ తాళ్లపల్లి రవి, సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ నాగటి జోసెఫ్, జిల్లా కన్వీనర్ చందాదాస్, కో కన్వీనర్ గాజుల రంబాయమ్మ,మద్దూరి కుమార్, వల్లమల్ల ప్రకాష్, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు అనుములపురి రామకృష్ణ, బొల్లెద్దు మహేందర్, అనుముల పురి బోస్,కూరపాటి విజయ్, చింతమల్ల జ్యోతి, చెవుల రమణ, గంధమల్ల విజయకుమార్, కట్ల విజయకుమార్, తదితరులు పాల్గొన్నారు.

previous post