మల్యాల
గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజక వర్గాలలో ఎంపిక చేసిన గ్రామాల్లో పథకాలను ప్రారంభించడంలో బాగంగా చొప్పదండి నియోజకవర్గం మల్యాల మండలం సర్వాపూర్ గ్రామంలో లబ్ధిదారులకు మంజూరి పత్రాలు జిల్లా అడిషనల్ కలెక్టర్ లత అందజేశారు. ఇందులో ఇందిరమ్మ ఆత్మీయ భరోస, రైతు భరోస, కొత్త రేషన్ కార్డులు,ఇందిరమ్మ ఇండ్లకు అర్హులైన లబ్ధిదారులకు మంజూరి పత్రాలను అందజేశారు.
ఈ కార్యక్రమం లో , ప్రత్యేక అధికారి, మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తిని మల్లేశ్వరిశ్రీనివాస్ గౌడ్,తహశీల్దార్ మునిందర్, ఎంపిడిఓ స్వాతి,ఎంపిఓ ప్రవీణ్ , వ్యవసాయ అధికారులు, ఇజిఎస్ అధికారులు, మండల కాంగ్రెస్ నాయకులు,గ్రామస్తులు పాల్గొన్నారు.