Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

రోగులకు ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్యం అందించేలా కృషి ….. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష* 102 వాహనాల ద్వారా గర్భిణీ స్త్రీలను ముందుగా ఆసుపత్రికి వచ్చేలా చూడాలి* ఎన్.సి.డి సర్వే తీరును ఎం.ఎల్.హెచ్.పి లు పర్యవేక్షించాలి టి-హబ్ ద్వారా త్వరగా పరీక్ష ఫలితాలు వచ్చేలా చర్యలు వైద్య ఆరోగ్యశాఖ పని తీరు పై సమీక్షించిన జిల్లా కలెక్టర్

 

పెద్దపల్లి; జిల్లాలోని రోగులకు ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా మెరుగైన వైద్య సేవలు అందేలా కృషి చేయాలని *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష* అన్నారు.

శనివారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్లో వైద్యారోగ్య శాఖ పని తీరుపై సమీక్ష నిర్వహించారు.మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రం, ఎన్.సి.డి సర్వే, డయాగ్నొస్టిక్ హబ్, పాలాటివ్ కేర్, టీబి నియంత్రణ వంటి పలు అంశాలపై జిల్లా కలెక్టర్ చర్చించి అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ*, మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రాల ద్వారా గర్భిణీ మహిళలకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని అన్నారు. 102 అమ్మ ఒడి వాహనాల ద్వారా గర్భిణీ మహిళలు రెగ్యులర్ చెక్ అప్ కోసం ఆసుపత్రికి ముందస్తుగా తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.జిల్లాలో ఎన్.సి.డి సర్వే వివరాలు బాగా జరుగుతున్నాయని, ఈ వివరాలను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో నమోదు చేయాలని, అవసరమైన వారికి మందులు అందేలా చూడాలని కలెక్టర్ తెలిపారు. గ్రామాలలో ఉన్న ఎం.ఎల్.హెచ్.పిలు ఎన్.సి.డి సర్వే తీరును పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు. *రాష్ట్రంలోనే రోగులకు డయాగ్నొస్టిక్ హబ్, వైద్య పరీక్షలు నిర్వహించి తొలి ఫలితాలు అందించడంలో పెద్దపెల్లి జిల్లా మొదటి స్థానంలో ఉందని*, దీనికి కృషి చేసిన అధికారులకు కలెక్టర్ అభినందనలు తెలిపారు. డయాగ్నొస్టిక్ హబ్ ద్వారా ప్రస్తుతం 6 గంటల వ్యవధిలో మనం ఫలితాలు అందిస్తున్నామని, దీనిని 4 గంటలకు తగ్గించేందుకు ప్రణాళికలు తయారు చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. పరీక్ష నమూనాలు టీ-హబ్ కు త్వరగా చేరుకునేలా రవాణా వ్యవస్థ రీ ఆర్గనైజ్ చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు.జిల్లా ఆస్పత్రులలో పాలేటివ్ కేర్ కింద అవసరమైన వారికి ఇన్ పేషెంట్ సేవలు అందించాలని అన్నారు. టీబీ కేసుల నియంత్రణ అంశంలో అనుమానం ఉన్న ప్రతి ఒక్కరికి పరీక్షల నిర్వహించి పాజిటివ్ వచ్చిన వారికి వెంటనే చికిత్స ప్రారంభించాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అన్న ప్రసన్న కుమారి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

అనాధ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం

Harish Hs

ఉన్నతమైన భవిష్యత్తుకు విద్య పునాది…

TNR NEWS

నిరుద్యోగ యువతకు అండగా నిలుస్తున్న జిల్లా గ్రంధాలయం.. జిల్లా గ్రంధాలయ సంస్ధ చైర్మన్ వంగవీటి రామారావు…  

TNR NEWS

మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని రైతులను వెంటనే విడుదల చేయాలి బిఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు కుర్ర సావిత్రి

TNR NEWS

ఎస్ఆర్ఎం పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం

Harish Hs

ల్యాండ్ సర్వే జూనియర్ అసిస్టెంట్ సస్పెండ్

TNR NEWS