December 8, 2024
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణవిద్య

సమానత్వాన్ని హరించి వేస్తున్న కేంద్ర బిజెపి ప్రభుత్వం… రాష్ట్రంలో ప్రజలు ఆశించినంతగా లేని కాంగ్రెస్ పరిపాలన… ప్రజల పక్షాన నిలబడి పాలకులను ప్రశ్నించేది ఎర్రజెండానే… సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి…

 

రాజ్యాంగం ద్వారా ప్రజలందరికీ కలిగిన సమాన హక్కులను, సమాన విలువలను, సమానత్వాన్ని కేంద్ర బిజెపి ప్రభుత్వం హరించి వేస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి అన్నారు. ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎంవీఎన్ భవన్లో జరిగిన సిపిఎం టూ టౌన్ మహాసభకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ప్రజల మధ్య వైశామ్యాలు సృష్టిస్తూ రాజ్యాంగం ద్వారా సంక్రమించిన సమానత్వాన్ని హరించి వేస్తుందని అన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో మైనార్టీలు,దళితులు,మహిళలపై దాడులు పెరిగాయని పేర్కొన్నారు. మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టి ఓట్లు దండుకుంటున్న బిజెపి ప్రజల సంపదను దోచి సంపన్నులకు కట్టబెడుతుందని అన్నారు.ప్రజల సంపదను దోచుకునే వారిని ఎదిరించి ప్రజల పక్షాన పోరాటం చేసేది ఎర్రజెండా తప్ప మరో జెండా లేదని అన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆశించిన విధంగా పరిపాలన చేయడం లేదని తెలిపారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తుందన్నారు. ఉచిత బస్సు మినహా ఏ పథకం కూడా పూర్తిస్థాయిలో అమలు కావడం లేదన్నారు. రైతాంగానికి రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి నేటికీ సక్రమంగా అమలు చేయలేదని పేర్కొన్నారు. రుణమాఫీ కోసం 30 వేల కోట్లు ఇస్తామని ప్రకటించి 18000 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుందని విమర్శించారు. రైతులు పండించిన పంటకు బోనస్ ప్రకటిస్తామని చెప్పి మాట తప్పి సన్న వడ్లకు మాత్రమే బోనసిస్తామని ప్రకటించడం విడ్డూరంగా ఉందని తెలిపారు. మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళకు ఇస్తానన్న 2500 ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో స్కీం వర్కర్లు వేతనాలు పెంచాలని పోరాటం చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడంలేదని అన్నారు. ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో జాప్యం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. పట్టణ ప్రాంతాలలో ప్రజలకు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పట్టణ ప్రాంత పేదలకు ఇల్లు ఇళ్ల స్థలాలు రేషన్ కార్డు లేక సంక్షేమ పథకాలు సక్రమంగా పొందలేకపోతున్నారని తెలిపారు. విద్యా వైద్యాన్ని ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిపించి అందరికీ అందుబాటులోకి తేవాలని పిలుపునిచ్చారు. నయా పైసా ఖర్చు లేకుండా పేదలందరికీ మెరుగైన వైద్యాన్ని అందించే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు. కేరళ రాష్ట్రంలో మాదిరిగా అందరికీ విద్య ఇండ్లు ఇళ్ల స్థలాలు పెన్షన్స్ వంటి పథకాలను రాష్ట్రస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన వాగ్దానాలు, ప్రజల సమస్యలపై నికరంగా పోరాటాలు నిర్వహించేది ఎర్రజెండా తప్ప మరో పార్టీ లేదని అన్నారు. ప్రజల పక్షాన పోరాటాలు నిర్వహిస్తున్న సిపిఎం పార్టీని ప్రతి ఒక్కరూ ఆదరించాలని పిలుపునిచ్చారు. మహాసభ ప్రారంభ సూచికగా ఎర్రజెండాను సిపిఎం సీనియర్ నాయకులు బొమ్మిడి లక్ష్మీనారాయణ ఆవిష్కరించారు అనంతరం సిపిఎం టూ టౌన్ కమిటీ సభ్యులు బోళ్ల వెంకటరెడ్డి పిండిగ నాగమణిల అధ్యక్ష వర్గంగా జరిగిన ఈ మహాసభలో సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు,కొలిశెట్టి యాదగిరిరావు,కోట గోపి,మట్టి పెళ్లి సైదులు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొప్పుల రజిత సిపిఎం టూ టౌన్ కార్యదర్శి బత్తుల వెంకన్న టౌన్ కమిటీ సభ్యులు ఉయ్యాల నగేష్,మోకర్ల వెంకన్న, మండల్ రెడ్డి వెంకట్ రెడ్డి,కామ్రేడ్ శ్రీనివాస్,కోట సృజన నాయకులు బోళ్ల సోమిరెడ్డి, ఇరుగు వెంకటయ్య,జహీర్ సాబ్, హఫీజ్ బాబు,చిత్రం భద్రమ్మ,సురేష్, రమణ శంబయ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి లో కొత్త రికార్డు సృష్టించిందని జుక్కల్ ఎమ్మెల్యే తోట

TNR NEWS

ఘనంగా విశ్రాంత ఉద్యోగుల ఆత్మీయ కలయిక…..

Harish Hs

అధ్వాన్న స్థితిలో దౌల్తాబాద్ పాఠశాల.

TNR NEWS

TNR NEWS

శ్రీ అన్నపూర్ణ విశ్వేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు 

TNR NEWS

TG UUEU రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి

TNR NEWS