Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణవిద్య

ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అభినందన

 

హైదరాబాద్ లోని యూసుఫ్ గూడలో గల కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఆదివారం యూత్ రోలర్ స్కేటింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన రోలర్ స్కేటింగ్ పోటీల్లో చేవెళ్ల మండల కేంద్రంలోని వివేకానంద విద్యాసంస్థకు చెందిన 13 మంది విద్యార్థులు గోల్డ్ మెడల్, 7 మంది విద్యార్థులు సిల్వర్ మెడల్, 10 మంది బ్రాంచ్ మెడల్ సాధించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచి యూత్ రోలర్ స్కేటింగ్ హైదరాబాద్ రీజన్ మొత్తానికి ఓరల్ ఛాంపియన్ షిప్ లో రెండో స్థానంలో నిలిచారని ఆ విద్యాసంస్థ ప్రిన్సిపాల్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా మెడల్స్ సాధించిన విద్యార్థులను సోమవారం వివేకానంద విద్యాసంస్థ చైర్మన్ కొరదాల నరేష్ అభినందించారు. అదేవిధంగా విద్యార్థులు ఈ విధమైన ప్రతిభ కనబరిచేందుకు శిక్షణనిచ్చిన వ్యాయామ ఉపాధ్యాయులను, విద్యార్థుల తల్లిదండ్రులను ప్రత్యేకంగా అభినందించారు. రానున్న రోజుల్లో తమ విద్యాసంస్థ నుంచి దేశం గర్వించదగ్గ క్రీడాకారులను తయారు చేస్తామని చైర్మన్ తెలిపారు.

Related posts

కోర్టులో ఈ-సేవ కేంద్రం ప్రారంభం 

TNR NEWS

బానోత్ బిక్షం నాయక్ మరణం తీరని లోటు

Harish Hs

*చేవెళ్లలో భారాసా దీక్షా దీవాస్*

TNR NEWS

హైదరాబాదులో జరిగే మాలల సింహ గర్జన సభను జయప్రదం చేయండి..  జాతీయ తెలంగాణ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు పరుస వెంకటేష్ పిలుపు..

TNR NEWS

తొర్రూర్ లో జాతీయ మధింపు పరీక్ష 

TNR NEWS

టీవీ ఏసి జేఏసీ నిరవధిక సమ్మె పోస్టర్ ఆవిష్కరణ

TNR NEWS