Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌పై హైకోర్టు కీలక తీర్పు

 

హైదరాబాద్  ఇప్పటికే రెగ్యులర్ అయిన కాంట్రాక్ట్ ఉద్యోగులకు తొలగించ వద్దని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఇక ముందు భర్తీ చేసే ఉద్యోగాలన్నీ చట్ట ప్రకారం నిర్వహించాలని హైకోర్టు తన ఆదేశాల్లో వెల్లడించింది. నేటి నుంచి ప్రభుత్వ ఉద్యోగాలన్నీ కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ కాకుండా నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేయాలని తన ఆదేశాల్లో హైకోర్టు పేర్కొంది.

 

కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌పై తెలంగాణ హైకోర్టు మంగళవారం ఈ తీర్పు వెలువరించింది. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడాన్ని నిరుద్యోగులు హైకోర్టులో సవాలు చేశారు. ఈ నేపథ్యంలో హైకోర్టు పైవిధంగా స్పందించింది. గతంలో 5,600 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే జీవో 16లోని సెక్షన్ 10ఏ ద్వారా రెగ్యులరైజ్ చేయడాన్ని సైతం ఈ సందర్భంగా హైకోర్టు తప్పు పట్టింది.

 

రాష్ట్రంలో మొత్తం 40 విభాగాల్లో ఉన్న 5,544 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను గత ప్రభుత్వం క్రమబద్దీకరించింది. వారిలో దాదాపు 3 వేల మంది జూనియర్ లెక్చరర్లు, 184 మంది ఒకేషనల్ లెక్చరర్లు, 390 మంది పాలిటెక్నిక్, 270 మంది డిగ్రీ లెక్చరర్లు, సాంకేతిక విద్యాశాఖలో 131 మంది అటెండర్లు, వైద్య ఆరోగ్య శాఖలో 837 మంది సహాయకులతోపాటు వివిధ విభాగాల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులను సైతం గత ప్రభుత్వం క్రమబద్దీకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిరుద్యోగులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ తరహా నిర్ణయాల కారణంగా తమ భవిష్యత్తు దెబ్బ తింటుందంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. అందులోభాగంగా వారు హైకోర్టును ఆశ్రయించారు..

Related posts

తెలంగాణ ప్రజల బతుకు చిత్రాన్ని మార్చింది బిఆర్ఎస్….

TNR NEWS

ఆర్టీసీ లోపనిభారాలు తగ్గించాలి. వేధింపులు అపాలి. సిఐటీయూ

TNR NEWS

నూతన ఎస్సైగా శివకుమార్ బాధ్యతల స్వీకరణ*

TNR NEWS

కోదాడలో ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు

Harish Hs

క్రీడలతో మానసిక ఉల్లాసం

Harish Hs

ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ విజయవంతం

Harish Hs