సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో హైందవ సోదరుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఆదివారం అట్టహాసంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, మాజీ ఎఫ్ డి సి చైర్మన్ ప్రతాప్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ భాస్కర్, డాక్టర్ నరేష్ బాబు, మాట్లాడుతూ హైందవ సోదరుల ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ముఖ్య భూమిక పోషించాడని దేశభక్తికి ప్రతిరూపం సుభాష్ చంద్రబోస్ అని వారి అడుగుజాడల్లో యువత పయనించాలని గజ్వేల్ లో మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయడం శుభ సూచికమని సుభాష్ చంద్రబోస్ విగ్రహ ఏర్పాటులో ముఖ్య పాత్ర పోషించిన మిన్న కంటి ప్రసాద్ హైందవ సోదరులను అభినందించారు. అనంతరం అందరి సమక్షంలో సుభాష్ చంద్రబోస్ విగ్రహ ప్రాంతాన్ని సుభాష్ చంద్రబోస్ చౌరస్తా అని నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో రాజశేఖర శర్మ,మున్సిపల్ పాలకవర్గం, మాజీ కౌన్సిలర్లు, హైందవ సోదరులు, మాజీ కౌన్సిలర్ సుభాష్ చంద్రబోస్, బుక్క రమేష్, మనోహర్ యాదవ్, సయ్యద్ మతిన్, సర్ధార్ ఖాన్, ఫారుక్ జానీ,నక్క రాములు గౌడ్,ఎల్లు రామ్ రెడ్డి, నంగునూరి సత్యనారాయణ, ఉప్పల ప్రవీణ్,ఉప్పల మధు, ఎన్ సి సంతోష్, బాల కుమార్ సుంకరి, నాయిని సందీప్, గోలి సంతోష్, బొమ్మ రమణ దేశబోయిన నర్సింలు,లయన్స్ క్లబ్ సభ్యులు, పెద్ద ఎత్తున గజ్వేల్ ప్రజ్ఞపూర్ పుర ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, యువజన సంఘాలు,యువకులు, అన్ని పార్టీల ప్రముఖులు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు