Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ప్రతీ ఒక్కరూ రాజ్యాంగ స్ఫూర్తిని అలవర్చుకోవాలి.

దేశంలో ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు, అవకాశాలు రాజ్యాంగం ద్వారా సంక్రమించాయని, ప్రతి ఒక్కరూ రాజ్యాంగ స్ఫూర్తిని అలవర్చుకొని సమాజంలో బాధ్యతగల పౌరులుగా మెలగాలని కోదాడ ప్రిన్సిపల్ అండ్ అడిషనల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కె. భవ్య కోరారు. రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా మంగళవారం కోదాడ కోర్టులో జరిగిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా న్యాయవ్యవస్థ, శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ సక్రమంగా పనిచేస్తున్నాయని అందువల్లే రాజ్యాంగంలో నిర్దేశించిన విధంగా అందరికీ అవకాశాలు లభిస్తున్నాయన్నారు. న్యాయ వ్యవస్థ పూర్తిగా రాజ్యాంగం పైన ఆధారపడి నడుస్తున్నదని అన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరు రాజ్యాంగానికి లోబడి జీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సెకండ్ క్లాస్ చిత్తలూరు సత్యనారాయణ, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎస్ ఆర్ కె మూర్తి, ఉపాధ్యక్షుడు గట్ల నరసింహారావు, ప్రధాన కార్యదర్శి చింతకుంట్ల రాంరెడ్డి, జాయింట్ సెక్రెటరీ హనుమంత రాజు, కోశాధికారి కోడూరు వెంకటేశ్వరరావు, కార్యవర్గం హేమలత, దొడ్డ శ్రీధర్, సామా నవీన్, నాగుల్ పాషా, సీనియర్ న్యాయవాదులు వేజెర్ల రంగారావు, సాధు శరత్ బాబు, ఎం వి ఎస్ శాస్త్రి, తాటి మురళి, ఉయ్యాల నరసయ్య, జానీ పాషా, రాంబాయి, పలువురు జూనియర్ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు…

Related posts

వారం రోజుల్లోగా మునగాల ప్రభుత్వ ఆసుపత్రి ఓపెనింగ్ : సామాజిక సేవ కార్యకర్త గంధం సైదులు

Harish Hs

భారీ వర్ష సూచనలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

TNR NEWS

ఇంజమ్మ అవ్వ గుడి ప్రారంభోత్సవంలో పాల్గొన్న- సరితమ్మ

TNR NEWS

వర్షానికి కూలినా ఇంటి పైకప్పు

TNR NEWS

క్యాపిటల్ ఇన్ఫర్మేషన్ క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే

TNR NEWS

బెజ్జుర్ మండలతహసీల్దార్ కు ఘోర అవమానం

TNR NEWS