Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

బాల సురక్ష కార్యక్రమం సేఫ్ టచ్, అన్ సేఫ్ టచ్ ఆవేర్నెస్ ప్రోగ్రాం.

కోదాడ పట్టణం లోని

KSSBM ZPGHS, MPPS ఆజాద్ నగర్ ప్రభుత్వ బాలికల పాఠశాలలో పదవ తరగతి మరియు నాలుగు, ఐదు తరగతుల బాలికలు సుమారు 200 మందికి ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ బాల సురక్ష వాలంటీర్ ఇంపాక్ట్ ట్రైనర్ వీరవిల్లి శ్రీలత బాలికలకు సేఫ్ టచ్ అన్ సేఫ్ టచ్ గురించి వివరించడం జరిగింది. సమాజంలో బాలికల పట్ల ఎన్నో రకాల ఇబ్బందులకి గురి అవుతున్నారు. పిల్లలు శారీరకంగా మానసికంగా ఉండటానికి చైల్డ్ సేఫ్ కు సంబంధించిన కార్యక్రమాన్ని కండక్ట్ చేస్తున్నాము. చాలా మంది పిల్లలు తెలిసి తెలియని వయసులో సర్వే ప్రకారం 50 శాతం మంది పిల్లలు లైంగిక వేధింపులకు గురిఅవుతున్నారు. 2020-22 వరకు సుమారు ఒక లక్ష ఇరవై వేల మంది లైంగిక వేధింపులకు గురి అయ్యారని ప్రభుత్వం వారి అంచనా. ఇది బయటికి తెలిసినవి తెలియనివి కొన్ని వేలు ఉంటాయి ఇలాంటి సొసైటీలో మన పిల్లలు జీవిస్తున్నారు మన పిల్లలకి, పిల్లలు యొక్క తల్లిదండ్రులకి, టీచర్స్ కి, కేర్ టేకర్స్ కి ఎంతో కొంత అవేర్నెస్ తీసుకురావాలని ఉద్దేశంతో పిల్లలకి సేఫ్ టచ్ అంటే ఏమిటి అన్ సేఫ్ టచ్ అంటే ఏంటి తెలియ చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది.

 అలాంటి ఇబ్బందుల్ని ఎలా ఎదుర్కోవాలి దాని గురించి వివరంగా చెప్పడం జరిగింది. ఇలాంటి తరగతులు నేటి సమాజానికి ఎంతో అవసరమని వచ్చిన పెద్దలు కొనియాడారు. ఈ కార్యక్రమానికి నా తోటి ఇంపాక్ట్ క్లబ్ సభ్యురాలు ఎం సుభాషిని మరియు హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు బి సుశీల బాయ్, ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు పి వరమ్మ, మరియు స్కూల్లో ఉపాధ్యాయ బృందం, వినీత మేడమ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related posts

మొల్లమాంబ విగ్రహ దిమ్మెను పునః ప్రతిష్ఠించాలి అణ గారిన కుమ్మరులకు అవమానం

TNR NEWS

పుస్తెల తాడు చోరీ కేసులో నిందితులు పట్టివేత

TNR NEWS

రైతు భరోసా కు ఎగనామం పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం  టిఆర్ఎస్ ప్రభుత్వం లోని రైతులు కళ్ళలో ఆనందం మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

TNR NEWS

అమ్మాపురం లో ఉచిత కంటి పరీక్ష శిబిరం 

TNR NEWS

మేధావుల సంఘీభావ సభకు తరలిరావాలి

Harish Hs

ప్రజా ప్రతినిధులకు ఆహ్వానం అందజేత

TNR NEWS