కిడ్నీ మార్పిడిలో బాధితులను మోసం చేసిన పది మంది ముఠా సభ్యులను కోదాడ పోలీసులు పట్టుకున్నారు. కోదాడ పట్నంలోని శ్రీరంగాపురం చెందిన నరేష్ తో విజయవాడకు చెందిన తాతారావు పృథ్వీరాజ్ మండపేట కు చెందిన గంగారావు రమాదేవి, వీరి తో పాటు మరో ఇద్దరిని ఆశ్రయించాడు.వారు 22 లక్షలకు ఒప్పందం కుదుర్చుకొని కిడ్నీ మార్పిడి చేశారు. ఫోర్జరీ స్టాంపులతో సంతకాలతో సర్టిఫికెట్ను సృష్టించి ఈ ముఠా లక్షల రూపాయలు బాధితుల నుంచి వసూలు చేసినట్లు డి.ఎస్.పి శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఆపరేషన్ అయిన తర్వాత హాస్పటల్ కి చెల్లించాల్సిన డబ్బులు ఇవ్వకుండా పారిపోవడంతో పోలీసులు నరేష్ నుంచి వివరాలు సేకరించారు దర్యాప్తు చేసిన పోలీసులు విజయవాడకు చెందిన ఈ ముఠాను పట్టుకున్నారు. ఆరుగురు నిందితులు పట్టు పడగా మరో నలుగురు పరారీలో ఉన్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటివరకు పదిమంది నుంచి కిడ్నీ మార్పిడి చేయించినట్లు ఆయన తెలిపారు. వారి వద్ద నుంచి ఏడు సెల్ ఫోన్లు రబ్బర్ స్టాంపులు స్వాధీనం చేసుకున్నట్టు డిఎస్పి తెలిపారు.

next post