Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

*రహదారుల అభివృద్ధికి పెద్దపీట*  • *ఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి*  • *కంగ్టి రూ.2కోట్ల 5లక్షల తో చేపట్టిన రోడ్లకు శంకుస్థాపన* 

రాష్ట్ర ప్రభుత్వం రహదారుల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి అన్నారు.కంగ్టి మండల కేంద్రంలోని సుభాష్ చంద్రబోస్ స్టాచ్ నుండి తడ్కల్ వైపు వెళ్లే ఒక కిలో మీటర్ రోడ్డు పనులకు నారాయణఖేడ్ ఎమ్మెల్యే మంగళవారం శంకుస్థాపన చేశారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ…. రోడ్డును ఏర్పాటు చేయాలని ప్రజలు ఎంతగానో ఇబ్బంది అవుతుందాని గతంలో కంగ్టి గ్రమ ప్రజలు ఎన్నో ధర్నాలు రాస్తారోకోలు నిర్వహించిన టిఆర్ఎస్ నాయకులు గాని ఎమ్మెల్యే గాని కనీసం ప్రజల వద్ద కూడా రాలేదని అన్నారు.గత ప్రభుత్వం 10 సంవత్సరలు అధికారంలో ఉండి రోడ్డు గురించి అసలు పాటించుకోలేదని అన్నారు. రోడ్డు గురించి ప్రజలు ఎంత ఇబ్బంది పడిన పట్టించుకోలేదని అన్నారు. ప్రజాపాలన ప్రభుత్వంలో అధికారంలో వచ్చిన సంవత్సరంలోపే రెండు కోట్ల ఐదు లక్షల రూపాయలు నిధులతో సిసీ రోడ్డు మంజూరు చేయించడం జరిగిందని అన్నారు. గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని అన్నారు. ప్రజా పాలన ప్రభుత్వంలో ప్రతి పేదవారికి సంక్షేమ పథకాలు అందించడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు.బిటి రోడ్డు అనుకూలంగా లేకపోవడంతో సిసి రోడ్డు కోసం ప్రతిపాదించినట్లు చెపారు. నాణ్యత ప్రమాణాలతో రోడ్డు నిర్మిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్లోళ్ల చంద్ర శేకర్ రెడ్డి డిసిసి ప్రధాన కార్యదర్శి, మరియు రాకేష్ కుమార్ షేట్కర్ రాష్ట యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి,షధుల్ సాబ్ సిడిసీ చైర్మన్,దామా నాగన్న మాజీ ఎంపీపీ, సర్దార్ నాయక్ మాజీ జడ్పీటీసీ,వినోద్ పాటిల్, రమేష్ చౌహాన్,తదితరులు పాలొగొన్నారు.

Related posts

కలాం దేశానికి  చేసిన సేవలు చిరస్మరణీయం

TNR NEWS

ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..

TNR NEWS

రేవంత్ రెడ్డి వద్దు…  మళ్ళీ కేసీఆర్ రావాలని-ఓ అవ్వ ముచ్చట

TNR NEWS

సంక్రాంతి పండుగకు సొంత ఊర్లకు వెళ్లే ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలి

Harish Hs

బేటి బచావో- బేటి పడావో వారోత్సవాలు నేటి నుంచి ప్రారంభం..

TNR NEWS

సోమవారం ప్రజావాణి రద్దు  వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రజావాణి కార్యక్రమం రద్దు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ 

TNR NEWS