ఆత్మకూరు మండల కేంద్రంలో ఈరోజు సాయంత్రం సెయింట్ తెరిసా హైస్కూల్లో సిల్వర్ జూబ్లీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన విద్యార్థులకు రాష్ట్రంలోనే ఉత్తమ విద్యను అందిస్తున్న మిషనరీ సంస్థ ఎంతో చాలా గొప్పదని ఈరోజుల్లో విద్యను వ్యాపారం చేస్తూ ఎన్నో ప్రైవేట్ పాఠశాల పుట్టుకొస్తున్నప్పటికీ వాటికి దీటుగా తక్కువ ఫీజులతో ప్రాంతీయ విభేదాలు లేకుండా కుల మతాలు లేకుండా బడుగు బలహీన విద్యార్థులకు తక్కువ ఫీజులతో విద్య అందిస్తున్న ఆత్మకూరు మండలంలోని ఆదర్శంగా నడుస్తున్న పాఠశాల సెయింట్ తెరిసా స్కూల్ అని కొనియాడారు విద్యతోపాటు కల్చరల్ ప్రోగ్రామ్స్ క్రీడలు ఎన్నో సేవా కార్యక్రమం నిర్వహిస్తున్న యాజమాన్యానికి ఎంతో అభినందనీయమన్నారు పాఠశాలకు వచ్చే మార్చి బడ్జెట్లో తర్వాత రోడ్డు వేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాఠశాల యొక్క చరిత్రను వివిధ కల్చర్ ప్రోగ్రాం తో తల్లితండ్రులకు వచ్చిన పెద్దలకు ముఖ్యులకు కండ్ల కట్టినట్టుగా చూపించారు ఈ కార్యక్రమంలో వివిధ ప్రజాప్రతినిధులు పాఠశాల యాజమాన్యం అధ్యాపక బృందం తదితరులు అందరు పాల్గొన్నారు