జగిత్యాల జిల్లా కోరుట్ల,మెట్ పల్లి పట్టణం పోలీస్ స్టేషన్ ఆవరణలో జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు మెట్ పల్లి డిఎస్పి రాములు ఆధ్వర్యంలో మంగళవారం ” రౌడీ మేళ ” కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా డిఎస్పి రాములు మాట్లాడుతూ..కోరుట్ల, మెట్ పల్లి సర్కిల్ పరిధిలోని రౌడీషీటర్లకు అందరికీ ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు పాల్పడవద్దని హెచ్చరించారు.చట్ట విరుద్ధ పనులు ఇసుక, భూవివాదల తాలుక పంచాయతీలు చేయకూడదని సూచించారు. సత్ప్రవర్తన కలిగి ఉండాలన్నారు.ఎవరైనా బెదిరింపులు చేస్తే పోలీసు వారికి తెలియజేయాలాని, పిర్యాదు దారుల వివరాలు గొప్యంగా ఉంచుతామన్నారు. కోరుట్ల, మెట్ పల్లి రెవెన్యూ డివిజన్ లలో 96 మంది రౌడీలు గా గుర్తించారు.అదేవిధంగా అసాంఘిక కార్యకలాపాలకు వారి ప్రస్తుత వివరాలను సేకరించి వారిపై నిఘా పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు డిఎస్పి సూచించారు. ప్రతి నెల నేర చరిత్ర ఉన్న వారితో మాట్లాడతామన్నారు.ఈ కార్యక్రమంలో సిఐ నిరంజన్ రెడ్డి, ఎస్ఐ చీరంజీవి మరియు పోలీసులు ఉన్నారు.